Anantapuram Dist.: సీఎం పర్యటన పేరుతో అధికారుల అత్యుత్సాహం..

ABN , First Publish Date - 2023-07-04T16:11:48+05:30 IST

అనంతపురం జిల్లా: ముఖ్యమంత్రి జగన్ పర్యటన అంటే చాలు.. ఏపీలో అధికారుల అత్యుత్సాహం అంతా ఇంతా కాదు.. సీఎం వస్తున్నారంటే చాలు.. వారం, పది రోజుల ముందునుంచే హంగామా చేస్తారు.

Anantapuram Dist.: సీఎం పర్యటన పేరుతో అధికారుల అత్యుత్సాహం..

అనంతపురం జిల్లా: ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) పర్యటన అంటే చాలు.. ఏపీ (AP)లో అధికారుల అత్యుత్సాహం అంతా ఇంతా కాదు.. సీఎం వస్తున్నారంటే చాలు.. వారం, పది రోజుల ముందునుంచే హంగామా చేస్తారు. వ్యాపారస్తులపై పెత్తనం, ఆంక్షలు, నాలుగు రోజుల ముందే ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions).. హడావుడి ఓ రేంజ్‌లో ఉంటుంది.

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మున్సిపల్ అధికారులు (Municipal Officers) అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఈనెల 8న సీఎం జగన్ పర్యటించనున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే హంగామా మొదలుపెట్టారు. వాల్మికి సెంటర్‌లో ఎన్నో ఏళ్లుగా ఉన్న షాపులను తొలగించారు. అలాగే సీఎం కాన్వాయ్ (CM Convoy) వెళ్లే మార్గంలో ఇరువైపుల ఉన్న చెట్లు, కూల్ డ్రింక్ షాపులు, చిన్న దుకాణాలను అధికారులు రాత్రికి రాత్రే జేసీబీలతో తొలగించారు. వాల్మీకి సర్కిల్ (Valmiki Circle) నుంచి గ్యాస్ గోడౌన్ (Gas Godown) వరకు దుకాణాలను తొలగించారు. ఎందుకిలా చేస్తున్నారని అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన సాకుతో పిచ్చుకపై బ్రహ్మస్త్రం చేస్తారా? అని ప్రజలు నిలదీస్తున్నారు. రైతు దినోత్సవం సందర్బంగా ఈ నెల 8న కళ్యాణదుర్గంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. సీఎం రూట్ మ్యాప్‌లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు, చిల్లర దుకాణాలను అధికారులు తొలగించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని చిరు వ్యాపారస్తులు నిలదీస్తున్నారు.

Updated Date - 2023-07-04T16:11:48+05:30 IST