Crime News: కన్న కూతురిపై తండ్రి దారుణం...

ABN , First Publish Date - 2023-07-02T10:12:36+05:30 IST

శ్రీ సత్య సాయి జిల్లా: అమ్మాయిలకు బయటే కాకుండా ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతోంది. బయటి వ్యక్తులే కాకుండా సొంత కుటుంబ సభ్యులు కూడా లైంగికంగా వేధిస్తున్నారు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కూతురినే కాటేశాడో కసాయి తండ్రి.

Crime News: కన్న కూతురిపై తండ్రి దారుణం...

శ్రీ సత్య సాయి జిల్లా: అమ్మాయిలకు బయటే కాకుండా ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతోంది. బయటి వ్యక్తులే కాకుండా సొంత కుటుంబ సభ్యులు కూడా లైంగికంగా వేధిస్తున్నారు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కూతురినే కాటేశాడో కసాయి తండ్రి. వావివరసలు మరిచి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. శ్రీ సత్య సాయి జిల్లా, మడకశిర నియోజకవర్గంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నాలుగేళ్లుగా కన్న కూతురిని శారీరకంగా హింసిస్తున్నాడు. దీంతో నరకం అనుభవిస్తున్న బాలిక ఇక తట్టుకోలేక శనివారం రాత్రి స్వచ్ఛంధ సంస్థను ఆశ్రయించింది. ఆ స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-07-02T10:18:39+05:30 IST