CM Jagan: జగనన్న వసతి దీవెన పథకం నిధులు విడుదల

ABN , First Publish Date - 2023-04-26T14:17:32+05:30 IST

అనంతపురం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) బుధవారం అనంతపురం జిల్లా (Anantapuram Dist.)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా...

CM Jagan: జగనన్న వసతి దీవెన పథకం నిధులు విడుదల

అనంతపురం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) బుధవారం అనంతపురం జిల్లా (Anantapuram Dist.)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నార్పలలో జగనన్న వసతి దీవెన పథకం (Jagananna Vasati Deevena Scheme) నిధులు విడుదల చేశారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912 కోట్లు జమ చేశారు. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు (ITI Students) రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు (Polytechnic Students) రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ విద్యార్థులకు (Degree, Entineering, Medicine Students) రూ.20 వేలు చొప్పున సాయం అందించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ చదువు కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదనేదే తమ ఉద్దేశమన్నారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని, నాడు-నేడుతో స్కూళ్ల రూపు రేఖలు మార్చేశామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

కాగా ఈ సభలో సీఎం జగన్.. చంద్రబాబు జపం చేశారు.. పనిలో పనిగా పిట్టకథలు చెబుతూ విమర్శలు గుప్పించారు. జాతీయ మీడియాకు ఒక ముసలాయన ఇంటర్వ్యూ ఇచ్చారని, వచ్చీరానీ ఇంగ్లీష్‌తో రిపబ్లిక్‌ టీవీకి చంద్రబాబు ఇంటర్వ్యూ ఇచ్చారన్నారు. అది చూస్తే తనకు పంచతంత్రం కథలు గుర్తుకొచ్చాయన్నారు. నరమాంసం తినే పులి ఇప్పుడు ముసలిదైందన్నారు. వేటాడే శక్తి లేకనే నాలుగు నక్కలను తోడేసుకుందన్నారు. మనుషులను చంపడం ఎలా అని ప్లాన్‌ చేసిందని, ఆ పులి అడవిలో తనకు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెబుతోందన్నారు. పులి ఇప్పుడు తానెవరినీ తినడంలేదని నమ్మిస్తోందని.. నరమాంసం తినే పులి.. మారిందంటే నమ్ముతామా? అని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పేవారిని ఎప్పుడూ నమ్మొద్దని, చంద్రబాబుకు ఎప్పుడూ బుద్ధి రాదని, మళ్లీ మోసం చేసేందుకే చంద్రబాబు పాత డైలాగ్‌లు మాట్లాడుతున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-04-26T14:17:32+05:30 IST