MLA Kethireddy : కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ అసలు స్వరూపం మరోసారి బట్టబయలు..

ABN , First Publish Date - 2023-06-22T10:57:03+05:30 IST

మరోసారి బట్టబయలైన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అసలు స్వరూపం వెలుగు చూసింది. కథ స్క్రీన్ ప్లే...డైరెక్షన్ లాగా కౌన్సిలర్లు, వాలంటీర్ల స్క్రిప్ట్‌తో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు.

MLA Kethireddy : కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ అసలు స్వరూపం మరోసారి బట్టబయలు..

శ్రీసత్యసాయి : మరోసారి బట్టబయలైన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అసలు స్వరూపం వెలుగు చూసింది. కథ స్క్రీన్ ప్లే...డైరెక్షన్ లాగా కౌన్సిలర్లు, వాలంటీర్ల స్క్రిప్ట్‌తో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ధర్మవరంలోని 23వ వార్డులో ఈ రోజు నిర్వహిస్తున్న గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం కు గృహ సారథులు, వాలంటీర్లు, వైసీపీ నేతలు కార్యకర్తలు రావాలని కౌన్సిలర్ ఎస్పీ షకీల్ భర్త ఎస్పీ భాష వాట్సాప్ సందేశం పంపారు.

అతిగా మాట్లాడే వారిని ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్న దగ్గరకు రానీయొద్దని వార్నింగ్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో ఎక్స్‌ట్రాలు చేసే వారిని ఎవరిని పిలవద్దని సూచించారు. ఇంటి దగ్గరకు అన్నయ్య వచ్చినప్పుడు జనాలు బిక్క మొహాలు వేసుకోకుండా నవ్వుతూ పలకరించాలని వాలంటీర్లకు హుకుం జారీ చేశారు. వార్డులోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నకు బొకేలు, పూల హారాలు, స్వీట్ బాక్స్ లతో స్వాగతం పలకాలని ఆదేశాలు జారీచేశారు. సామాజిక మాధ్యమాల్లో 23వ వార్డు కౌన్సిలర్ భర్త, వైసీపీ నేత బాషా ఆడియో వైరల్ అవుతోంది.

Updated Date - 2023-06-22T10:57:03+05:30 IST