Paritala Sunita: సొంత చెల్లికి న్యాయం చేయలేని సీఎం..
ABN , First Publish Date - 2023-05-23T15:18:57+05:30 IST
అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత..? లేకపోతే ఎంత..?
అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunita) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సొంత చెల్లికి న్యాయం చేయలేని సీఎం (CM) ఉంటే ఎంత..? లేకపోతే ఎంత..? అని అన్నారు. సొంత చిన్నాన్నను హత్య చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని అరెస్టు చేసేందుకు అంతమంది పోలీసులు అవసరమా? అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో సీబీఐ (CBI)కు సహకరించకుండా పోలీసులు డ్రామాలు నడుపుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలను మాత్రం అర్ధరాత్రి, తెల్లవారుజామున ఇళ్లల్లో దూరి అరెస్టులు చేస్తారు కదా అని అన్నారు. వారికి ఒక న్యాయం.. అవినాష్ రెడ్డికి ఇంకో న్యాయం ఉంటుందా? అని నిలదీశారు. ఒక ఆడబిడ్డ సునీత.. తన తండ్రిని చంపిన వారిని చూపించినా శిక్షించలేకపోతున్నారని పరిటాల సునీత మండిపడ్డారు.