Anantapur Dist.: జగన్ సర్కార్‌పై మహిళా కూలీల అసహనం..

ABN , First Publish Date - 2023-05-30T16:39:02+05:30 IST

‘జగన్ ప్రభుత్వంలో ఏమీ లేదప్పా ప్రతీది రేటే అంటూ’ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై మహిళా కూలీలు అసంతృప్తి వ్యక్తం చేశారు...

Anantapur Dist.: జగన్ సర్కార్‌పై మహిళా కూలీల అసహనం..

అనంతపురం జిల్లా: ‘ఈ ప్రభుత్వంలో ఏమీ లేదప్పా ప్రతీది రేటే అంటూ’ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) పాలనపై మహిళా కూలీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా, బొమ్మనహళ్ మండలం, నేమకల్లుకు చెందిన మహిళా కూలీలను ఓ వ్యక్తి పరామర్శించాడు. ఎలా ఉన్నారు? జగన్ పాలన (Jagan Govt.) ఎలా ఉందంటూ ప్రశ్నించాడు. దీంతో కూలీ పనులకు వెళుతున్న మహిళలు (womens) ఒక్కసారిగా స్పందించారు. తమ కష్టాలను ఏకరువు పెట్టారు. ఏపీ-కర్ణాటక (AP-Karnataka) సరిహద్దు ప్రాంతానికి చెందినవారు కావడంతో మహిళా కూలీలు కన్నడంలో మాట్లాడారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదని, అన్నీ ధరలు పెంచారని, ఒక్క ఇల్లు కట్టించి ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ బిల్లు రూ. 5 వందలు వస్తోందని, ఒక్క రోజు ఆలస్యమైనా వంద రూపాయల జరీమానతో కట్టాల్సి వస్తోందంటూ వాపోయారు. రేషన్ షాపులో బియ్యం ఒక్కటే ఇస్తున్నారని, గతంలో పప్పు, ఉప్పు, ఆయిల్ అన్నీ ఇచ్చేవాళ్లని అన్నారు. ఈ ప్రభుత్వానికి నమస్కారం అంటూ చేతులతో మొక్కారు. ఈ వీడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2023-05-30T16:39:02+05:30 IST