AP Assembly : ఆయన ప్రసంగం ముగిశాకే రియాక్ట్ అవుతుందట..
ABN , First Publish Date - 2023-03-14T08:57:51+05:30 IST
ఉదయం 9 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి శాసన సభ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. ప్రజా సమస్యలపై సభలో చర్చకు పట్టుబట్టాలని తెలుగు దేశం పార్టీ నిర్ణయించింది. అయితే..
అమరావతి : నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడనుంది. సభ వాయిదా పడ్డాక బీఏసీ సమావేశం నిర్వహించి సమావేశాల ఎజెండాను బీఏసీ నిర్ణయించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గంట పాటు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.
ఉదయం 9 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి శాసన సభ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. ప్రజా సమస్యలపై సభలో చర్చకు పట్టుబట్టాలని తెలుగు దేశం పార్టీ నిర్ణయించింది. కనీసం 20 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరగాలని టీడీపీ డిమాండ్ చేసింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ తొలి ప్రసంగం కావడంతో సంయమనంతో వ్యవహరించాలని టీడీపీ ఎమ్మెల్యేల నిర్ణయించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాతనే రియాక్ట్ అవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.