Purandeshwari: ‘హర్ ఘర్ తిరంగా’ విజయవంతం చేయాలి.. నేతలకు పురందేశ్వరి పిలుపు
ABN , First Publish Date - 2023-08-12T11:29:34+05:30 IST
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ నేతలతో ఆపార్టీ రాష్ట్ర అధినేత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి వర్చువల్ విధానంలో శనివారం సమావేశం నిర్వహించారు.
అమరావతి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ నేతలతో ఆ పార్టీ రాష్ట్ర అధినేత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి (AP BJP Chief Daggubati Purandeshwari) వర్చువల్ విధానంలో శనివారం సమావేశం నిర్వహించారు. సర్పంచ్ల సమస్యలపై పోరాటం బాగా చేశారంటూ నేతలకు అభినందనలు తెలియజేశారు. జనసేన, బీజేపీ పొత్తు సంకేతాలు బలంగా వినిపించాలని పురందేశ్వరి సూచించారు. ఇంటింటికి త్రివర్ణ పతాక కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేద్దామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మూడు రోజులు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. ఈనెల 14న విభాజిత్.. విభీషణ్ కార్యక్రమం చేపట్టాలని నేతలకు తెలియజేశారు. డాక్యుమెంటరీ ప్రదర్శనతో పాటు రాత్రి కొవ్వుత్తుల ప్రదర్శనను బీజేవైఎం ఆధ్వర్యంలో విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈవిధంగా హర్ ఘర్ తిరంగా, విభాజిత్ - విభీషణ్ జాతీయ స్ధాయిలో చేస్తున్నారని తెలిపారు. ఏపీలో ఈ కార్యక్రమాలు విజయవంతం చేసేలా అందరూ పని చేయాలని నేతలకు పురందేశ్వరి ఆదేశాలు జారీ చేశారు.