AP BJP: విజయవాడలో శంఖానాదం కార్యక్రమానికి ఏపీ బీజేపీ శ్రీకారం

ABN , First Publish Date - 2023-08-31T12:58:27+05:30 IST

ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో శంఖానాదం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బీజేపీ సోషల్ మీడియా, ఐటి ప్రతినిధులకు వర్కుషాపు నిర్వహించారు.

AP BJP: విజయవాడలో శంఖానాదం కార్యక్రమానికి ఏపీ బీజేపీ శ్రీకారం

విజయవాడ: ఏపీ బీజేపీ (AP BJP) ఆధ్వర్యంలో శంఖానాదం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బీజేపీ సోషల్ మీడియా, ఐటి ప్రతినిధులకు వర్క్‌ షాపు నిర్వహించారు. శిక్షణ ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి పునీత్ ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి (AP BJP Chief Daggubati Purandeshwari) ప్రారంభోపన్యాసం చేశారు. సోషల్ మీడియాలో కేంద్రం ఏపీకీ చేసిన సాయం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను తమప్రతినిధులు వివరిస్తారన్నారు. ఎన్నికల సమయానికి అందరూ సన్నధ్దం కావాలని పిలుపునిచ్చారు. నేడు సోషల్ మీడియా ఎంతో కీలకంగా పనిచేస్తుందన్నారు. సమాజంలో సోషల్ మీడియా అంశాలపైనే చర్చ సాగుతోందని తెలిపారు. సోషల్ మీడియాలో ఎలా పని‌చేయాలో నేడు శిక్షణ ఇస్తామన్నారు. ఎన్నికల సమర శంఖం పూరించేలా... శంఖానాదం అని పేరు పెట్టామని చెప్పారు. మహిళల కోసం మోడీ ఒక అన్ గా అండగా నిలిచారన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మోడీ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణులు కోసం గ్యాస్ సిలిండర్ ధర తగ్గించారని అన్నారు. గ్రామ పంచాయతీల నిధులు మళ్లింపుపై తాము పోరాటం చేశామని..తమ మిత్ర పక్షం జనసేనతో కలిసి ఆందోళనలు నిర్వహించామన్నారు. అన్ని అంశాలను గవర్నర్‌కు, కేంద్రంలో పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ‘‘నా భూమి, నాదేశం‌’’ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిందన్నారు. సెప్టెంబరు ఒకటి నుంచి 15 వరకు అన్ని గ్రామాల్లో మట్టిని సేకరిస్తామని.. పట్టణాలు, నగరాల్లో బియ్యం సేకరిస్తామని.. ఈ మట్టి ని ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ అన్ని రాష్ట్రాల మట్టితో అమృత వనం ఏర్పాటు చేస్తామని పురందేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - 2023-08-31T12:58:27+05:30 IST