AP High Court: పదవీ విరమణ వయసు పెంపు ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

ABN , First Publish Date - 2023-05-09T23:10:40+05:30 IST

పదవీ విరమణ వయసు పెంపుపై ఏపీ హైకోర్టు (AP High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

AP High Court: పదవీ విరమణ వయసు పెంపు ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

అమరావతి: పదవీ విరమణ వయసు పెంపుపై ఏపీ హైకోర్టు (AP High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వులు కార్పొరేషన్ ఉద్యోగులకు వర్తించవని ఏపీ హైకోర్టు పేర్కొంది. కార్పొరేషన్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసులు వేరుగా ఉంటాయని హైకోర్టు తెలిపింది. కార్పొరేషన్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజనల్ బెంచ్‌లో ఏపీ ప్రభుత్వం (AP GOVT) సవాల్ చేసింది. విచారణ అనంతరం సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజనల్‌ బెంచ్ కొట్టివేసింది. కార్పొరేషన్, సొసైటీల ఉద్యోగుల సర్వీసు రూల్స్ రాజ్యాంగంలోని 309 కింద రూపొందించలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

Updated Date - 2023-05-09T23:11:32+05:30 IST