TDP: ‘వైసీపీ నేతల తప్ప ఇంకెవరూ మాట్లాడకూడదా?’

ABN , First Publish Date - 2023-04-16T19:00:44+05:30 IST

సీఐడీ (CID) సీఎం (CM) చేతిలో పకోడీలా మారిందని టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Acham Naidu) అన్నారు.

TDP: ‘వైసీపీ నేతల తప్ప ఇంకెవరూ మాట్లాడకూడదా?’

అమరావతి: సీఐడీ (CID) సీఎం (CM) చేతిలో పకోడీలా మారిందని టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Acham Naidu) అన్నారు. మార్గదర్శి వ్యహహారంపై మాట్లాడిన న్యాయవాదులకు సీఐడీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇది యావత్ న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడన్నారు. ఇన్నాళ్లు ప్రతిపక్ష నేతల గొంతు నొక్కిన జగన్ రెడ్డి ఇప్పుడు న్యాయవాదుల నోరు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ (YCP) నేతలు తప్ప ఇంకెవరూ మాట్లాడకూడదన్నట్టు జగన్ వైఖరి ఉందన్నారు. సీఐడీ నోటీసులు భావస్వేచ్ఛ ప్రకటనకు వ్యతిరేకమన్నారు. న్యాయవాదులకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 126 కింద వృత్తి వ్యవహారం గురించి ఎవరికీ ప్రశ్నించే హక్కు లేదని పేర్కొన్నారు. సీఐడీ అధికారులు ఓవరాక్షన్ మానుకోవాలి, లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు.

Updated Date - 2023-04-16T19:00:44+05:30 IST