Kollu Ravindra: జగన్ తలకిందులుగా తపస్సుచేసినా..: కొల్లు రవీంద్ర

ABN , First Publish Date - 2023-06-14T15:51:07+05:30 IST

బీసీలహక్కులు, స్వేచ్ఛను కాపాడేందుకు, ప్రతి బీసీ (BC)కి జగన్ (Jagan) చేసిన మోసాన్ని తెలియచేసేందుకే..

Kollu Ravindra: జగన్ తలకిందులుగా తపస్సుచేసినా..: కొల్లు రవీంద్ర

అమరావతి: బీసీలహక్కులు, స్వేచ్ఛను కాపాడేందుకు, ప్రతి బీసీ (BC)కి జగన్ (Jagan) చేసిన మోసాన్ని తెలియచేసేందుకే బీసీ భరోసాబాట కార్యక్రమం చేపట్టామని మాజీమంత్రి కొల్లురవీంద్ర (Kollu Ravindra) అన్నారు. జగన్ తలకిందులుగా తపస్సుచేసినా టీడీపీ (TDP) బీసీ భరోసాబాటను అడ్డుకోలేడన్నారు. ఏపీ (AP)లో బీసీనేతలే లేరన్నట్టు, తనకు ఊడిగంచేసే తెలంగాణ (Telangana) నేతలకు జగన్ రాజ్యసభ పదవి ఇచ్చాడని విమర్శించారు. పదవుల్ని ఎరగావేసి, పొరుగురాష్ట్ర బీసీనేతలతో ప్రచారంచేయించి, ఏపీబీసీల్లో విషబీజాలు నాటి, వారి ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. 4 ఏళ్లలో బీసీలకు తప్పుడుకేసులు, ఆస్తుల ధ్వంసం, హత్యలు, అవమానాలు, వేధింపుల్ని కానుకగా ఇచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిని కోర్టులు తప్పుపడుతున్న, ఆయన కోర్టుల్ని ధిక్కరిస్తున్నా న్యాయమూర్తిగా పనిచేసిన ఈశ్వరయ్య ఎందుకు మౌనంగా ఉన్నాడు? అని ప్రశ్నించారు. సిగ్గులేకుండా పదవులకోసం కక్కుర్తిపడిన ఈశ్వరయ్యలాంటి వాళ్లు, జగన్‌ను సమర్థించి రాష్ట్రంలోని బీసీలకు తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పంచనచేరి, బలహీన వర్గాలకు తీరనిద్రోహం చేస్తున్న ఈశ్వరయ్య లాంటివాళ్లను రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు. బీసీల్నిభయపెట్టి, తనబానిసలుగా మార్చాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగనివ్వమన్నారు.

Updated Date - 2023-06-14T15:51:07+05:30 IST