అప్పుడు డీజే పాటలు తప్పులేదు.. ఇప్పుడు మాత్రం..: ఎంపీ రఘురామ
ABN , First Publish Date - 2023-01-25T17:04:23+05:30 IST
జగన్ పాదయాత్రలో డీజే పాటలు వేసుకొని వెళ్లారని ఎంపీ రఘురామరాజు (MP Raghu Rama Krishnam Raju) గుర్తుచేశారు.
ఢిల్లీ: జగన్ పాదయాత్రలో డీజే పాటలు వేసుకొని వెళ్లారని ఎంపీ రఘురామరాజు (MP Raghu Rama Krishnam Raju) గుర్తుచేశారు. లోకేష్ (Lokesh) యువగళంకు మాత్రం షరతులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు (Highcourt) లో జీవో నం.1 రద్దు చేస్తే యాత్రకు అన్ని ఇబ్బందులు తప్పుతాయన్నారు. ఏపీ ప్రభుత్వం (AP Govt) అప్పుల మీద అప్పులు చేసిందని, ఈ ఏడాది రూ.80 వేల కోట్లు అప్పు చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిపై ఫోకస్ చేస్తుంటే.. ఏపీలో పరిశ్రమలు పెడతామంటే.. మాకేంటి అంటున్నారని ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు.