AP News: ఆ విషయంలో జగన్ తో బహిరంగ చర్చకు నేను సిద్ధం: రఘురామ
ABN , First Publish Date - 2023-01-11T17:41:52+05:30 IST
ఏపీలో షిర్డీసాయి కంపెనీకి 5వేల ఎకరాలు ఇస్తామంటున్నారని ఎంపీ రఘురామ (MP Raghurama Krishnam Raju) అన్నారు.
ఢిల్లీ: ఏపీలో షిర్డీసాయి కంపెనీకి 5వేల ఎకరాలు ఇస్తామంటున్నారని ఎంపీ రఘురామ (MP Raghurama Krishnam Raju) అన్నారు. రైతుల పొట్టకొట్టి ఇన్ని వేల ఎకరాలు కంపెనీకి ఇవ్వడం అవసరమా?, షిర్డీసాయి కంపెనీకి రూ.80 వేల కోట్ల ప్రాజెక్ట్ ఇవ్వడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. కడప వాసి తప్పితే విశ్వేశ్వరరెడ్డికి వేరే గుర్తింపు ఏమీలేదన్నారు. ఇది కేవలం జగన్‌రెడ్డి (CM Jagan) స్థలయజ్ఞం మాత్రమేనని విమర్శించారు. రామాయపట్నం పోర్టుకు ల్యాండ్ తీసుకుంటున్నామని చెప్పి కడప వాసికి భూమి అప్పగించడం సరికాదన్నారు. దీనిపై జగన్‌రెడ్డితో బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు.