Payyavula Keshav: నిరసన తెలిపితే చంపేస్తారా?: పయ్యావుల
ABN , First Publish Date - 2023-06-05T17:11:06+05:30 IST
ఏపీ (AP)లో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందని టీడీపీ (TDP) సీనియర్ నేత పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ఏపీ (AP)లో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందని టీడీపీ (TDP) సీనియర్ నేత పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపితే చంపేస్తారా? ప్రజలకు నిరసన తెలిపే హక్కులేదా? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి వైసీపీ నేతలు పిలుపునిస్తే.. ఎమ్మెల్యేకు రక్షణ ఇవ్వాల్సిందిపోయి ముట్టడికి సహకరిస్తారా? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షనేతలనే టార్గెట్ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. 4ఏళ్లైనా జగన్ ప్రభుత్వ తీరులో ఎలాంటి మార్పులేదన్నారు.