Yanamala: రెండుసార్లు పిలిచినా ఆ పార్టీ నుంచి స్పందనలేదు: యనమల
ABN , First Publish Date - 2023-02-15T21:12:12+05:30 IST
వైసీపీ (YCP) ప్రభుత్వానికి వ్యవస్థలపై గౌరవం లేదని మాజీ మంతరి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: వైసీపీ (YCP) ప్రభుత్వానికి వ్యవస్థలపై గౌరవం లేదని మాజీ మంతరి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అప్పులు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని రెండుసార్లు పిలిచినా వైసీపీ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. 2018లో రూ.16వేల కోట్లు ఉన్న రెవెన్యూ లోటు నేడు రూ.40వేల కోట్లకు ఎందుకు పెరిగింది? అని యనమల ప్రశ్నించారు.