TDP: ‘బీసీ అనే పేరు వింటే జగన్ రెడ్డికి ఎందుకంత బీపీ?’
ABN , First Publish Date - 2023-04-30T19:57:11+05:30 IST
బీసీ (BC) అనే పేరు వింటే జగన్‌రెడ్డి (CM Jagan)కి ఎందుకంత బీపీ? అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (MLC Panchumarthi Anuradha) ప్రశ్నించారు.
అమరావతి: బీసీ (BC) అనే పేరు వింటే జగన్‌రెడ్డి (CM Jagan)కి ఎందుకంత బీపీ? అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (MLC Panchumarthi Anuradha) ప్రశ్నించారు. టీడీపీ (TDP) నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌ల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్ రెడ్డి పాలనలో బీసీలపై దాడులు, అక్రమ కేసులు నిత్యకృతమయ్యాయని ఆమె మండిపడ్డారు. తాత రాజారెడ్డి నుంచి మనవడు జగన్ రెడ్డి వరకు అంతా బీసీలపై కక్ష్య సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ (YCP) నాలుగేళ్ల పాలనలో బీసీలకు జరిగిన న్యాయం కంటే జరిగిన అన్యాయమే ఎక్కువ అని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్నీ ఆర్దికంగా రాజకీయంగా అణిచివేస్తున్న జగన్ రెడ్డికి బుద్ది చెప్పేందుకు బీసీలంతా సిద్దంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని పవర్ నుంచి దింపేసి బీసీల పవర్ ఏంటో చూపుతామని సవాల్ విసిరారు. బీసీ ద్రోహి జగన్‌రెడ్డిని రాష్ట్రం నుంచి సాగనంపుతామన్నారు.