CID ADGP: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. తప్పుడు డాక్యుమెంట్స్‌తో ఒప్పందాలు
ABN , First Publish Date - 2023-09-14T17:23:00+05:30 IST
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (skill development case) ఇది రూ. 3300 కోట్లు ప్రాజెక్ట్ అని ఏపీ సీఐడీ ఏడీజీపీ ఎన్. సంజయ్ (AP CID ADGP N. Sanjay) తెలిపారు.
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (skill development case) ఇది రూ. 3300 కోట్లు ప్రాజెక్ట్ అని ఏపీ సీఐడీ ఏడీజీపీ ఎన్. సంజయ్ (AP CID ADGP N. Sanjay) తెలిపారు.
"ఇందులో 370 కోట్లు స్కామ్ జరిగినట్లు గుర్తించాం. సిమెన్స్ ద్వారా స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎంవోయూలో లేదు. రూ. 241 కోట్లు నేరుగా ఒక కంపెనీకి అక్కడి నుంచి షెల్ కంపెనీలకు వెళ్లాయి. ఈ కేసును 10 అంశాలు గుర్తించాం. ఈ కేసులో ఈడీ ఎంటర్ అయింది చాలా మందిని అరెస్ట్ చేసింది. 2021 ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన తరువాత చాలా అంశాలు వచ్చాయి. చంద్రబాబు 13 ప్రదేశాల్లో సంతకాలు చేశారు. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్‌లో రూ.370 కోట్లు రిలీజ్ చేయమని ఆర్డర్ చేశారు. జె వెంకటేశ్వర్లు అనే ఓ ప్రైవేటు వ్యక్తిని నియమించుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం.. జీవో కంటే ముందే అగ్రిమెంట్ తయారీ, తప్పుడు పత్రాలతో ఒప్పందాలు. అగ్రిమెంట్‌లో జీవో నెంబర్‌ను చూపించలేదని.. జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్‌లో లేవు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రూ.371 కోట్ల అవినీతి జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లను రిలీజ్ చేశారు. అధికారుల అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తప్పుడు డాక్యుమెంట్స్‌తో ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వ జీవోలకు, అగ్రిమెంట్‌కు చాలా తేడాలు ఉన్నాయి. అగ్రిమెంట్‌లో జీవో నెంబర్‌ను చూపించలేదని.. జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్‌లో లేవు. జీవో కంటే ముందే అగ్రిమెంట్ తయారైంది. క్యాబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు. క్యాబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు. కార్పొరేషన్ ఏర్పాటులోనూ విధి విధానాలు పాటించలేదు. కార్పొరేషన్ నుంచి ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు వెళ్లాయని, ఆ ప్రైవేట్ వ్యక్తుల నుంచి షెల్ కంపెనీలకు మళ్లాయి." అని ఏపీ సీఐడీ ఏడీజీపీ ఎన్. సంజయ్ తెలిపారు.