Share News

Atchannaidu: వైసీపీ ప్రభుత్వ అసమర్థతను టీడీపీకి అంటగడతారా?

ABN , First Publish Date - 2023-12-09T11:54:54+05:30 IST

Telangana: జగన్ రెడ్డి పత్రిక సాక్షివన్నీ అబద్ధపు, తప్పుడు రాతలే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ అసమర్థతను టీడీపీకి అంటగడతారా అని ప్రశ్నించారు.

Atchannaidu: వైసీపీ ప్రభుత్వ అసమర్థతను టీడీపీకి అంటగడతారా?

అమరావతి: జగన్ రెడ్డి పత్రిక సాక్షివన్నీ అబద్ధపు, తప్పుడు రాతలే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ అసమర్థతను టీడీపీకి (TDP) అంటగడతారా అని ప్రశ్నించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమనడం సిగ్గుచేటన్నారు. ప్రాజెక్టుల నిర్వహణను జగన్ రెడ్డి గాలికొదిలేశారని విమర్శించారు. జగన్ రెడ్డి సోమరితనంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు ఊడి నీరు వృథాగాపోతందోన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా తమపై నిందలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ - క్యూసెక్కుకి తేడా తెలియని వారికి నీటిపారుదల శాఖ కట్టబెట్టారన్నారు. ప్రభుత్వ తీరు మారకపోతే ప్రాజెక్టుల దగ్గర ఆందోళనలు చేపడతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Updated Date - 2023-12-09T11:54:55+05:30 IST