Avinash Reddy : అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ రద్దు కేసును సుప్రీంలో మెన్షన్ చేసిన సునీత తరుఫు న్యాయవాది..

ABN , First Publish Date - 2023-06-09T11:34:41+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఆయన కూతురు సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నేడు ధర్మాసనం ముందు సునీత రెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్థ లుత్రా కేసు మెన్షన్ చేశారు. మంగళవారం విచారణ జరుపుతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్ తో కూడిన ధర్మాసనం వెల్లడించింది.

Avinash Reddy : అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ రద్దు కేసును సుప్రీంలో మెన్షన్ చేసిన సునీత తరుఫు న్యాయవాది..

ఢిల్లీ : వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఆయన కూతురు సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నేడు ధర్మాసనం ముందు సునీత రెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కేసు మెన్షన్ చేశారు. మంగళవారం విచారణ జరుపుతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్ తో కూడిన ధర్మాసనం వెల్లడించింది.

అవినాష్ రెడ్డి ప్రధాన కుట్ర దారుడు అని, దర్యాప్తు సంస్థ అరెస్టు చేయకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని వాదనలు సందర్భంగా సిద్దార్థ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు . ఏప్రిల్ 24న సీజేఐ ధర్మాసనం ఆదేశాల తర్వాత... సీబీఐ నాలుగు సార్లు అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేసినా... విచారణకు హాజరు కాలేదన్నారు. ఒక ఎంపీగా ఉన్న వ్యక్తికి స్థానిక ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని, సీబీఐ విచారణను అడ్డుకుంటోందని వెల్లడించారు.

సీబీఐ విచారణకు సహకరించకుండా... తన తల్లి ఆరోగ్యం బాగోలేదని కర్నూలులో హంగామా చేశారని సిద్దార్థ లూథ్రా తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి అవునని సిద్దార్థ లూథ్రా సమాధానం ఇచ్చారు. వెంటనే విచారణకు తీసుకోవాలని సునీత తరుఫు న్యాయవాది కోరారు.మంగళవారం విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

అవినాశ్‌కు గత నెల 31న తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సునీత సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అవినాశ్‌పై మోపిన అభియోగాలన్నీ చాలా కీలకమైనవని పిటీషన్‌లో సునీత పేర్కొన్నారు. సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్‌లో సునీత పేర్కొన్నారు. హైకోర్టు తీర్పులో కొన్ని లోపాలున్నాయని కూడా సునీత తెలిపారు. అవినాశ్ ముందస్తు బెయిల్‌ను సీబీఐ సైతం వ్యతిరేకిస్తోందని పిటిషన్‌లో వెల్లడించారు.

Updated Date - 2023-06-09T11:57:38+05:30 IST