Bhumana Karunakarreddy: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన భూమన కరుణాకర్‌రెడ్డి
ABN , First Publish Date - 2023-08-09T12:49:56+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని టీటీడీ నూతన ఛైర్మన్‌గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు.
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని (AP CM YS Jaganmohan Reddy) టీటీడీ నూతన చైర్మన్‌గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chairman Bhumana karunakar Reddy) బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించిన సీఎంకు భూమన కృతజ్ఞతలు తెలిపారు. రేపు (గురువారం) ఉదయం తిరుమలలో టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే భూమన తనయుడు అభినయ్ రెడ్డి కూడా సీఎం జగన్‌ను కలిశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌గా (TTD Chairman) భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy)ని ఏపీ ప్రభుత్వం నియమించింది. గతంలోనూ కరుణాకర్‌రెడ్డి టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. 2006-2008 మధ్య టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం భూమన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ముగియనుండటంతో టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి (YV subbareddy) అనంతరం నూతన టీటీడీ చైర్మన్‌గా భూమనకరుణాకర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వైవీ సుబ్బారెడ్డి రెండు సార్లు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2019 జూన్ 22న వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా తొలిసారి ప్రభుత్వం నియమించింది. తిరిగి 2021 జూన్ 22న వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా పదవీ కాలం ముగియడంతో తిరిగి ఆయనకే రెండోసారి టీటీడీ చైర్మన్ బాధ్యతలను అప్పగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2021 ఆగష్టు 8న వైవీ సుబ్బారెడ్డి రెండవ సారి టీటీడీ చైర్మన్‌గా నియమితులయ్యారు. దీంతో రెండు దఫాలుగా వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు తాజాగా మరో రెండు రోజుల్లో టీటీడీ పాలకమండలి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో టీటీడీ తదుపరి చైర్మన్ ఎవరు దానిపై ఆసక్తికర చర్చ జరిగింది. చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికే ఆ బాధ్యతలు అప్పగిస్తూ జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.