BJP: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ABN , First Publish Date - 2023-02-14T22:17:48+05:30 IST

పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC elections) అభ్యర్థులను ప్రకటించినట్లు బీజీపీ (BJP) తెలిపింది.

BJP: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

హైదరాబాద్: పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC elections) అభ్యర్థులను ప్రకటించినట్లు బీజేపీ (BJP) తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా సన్నరెడ్డి దయాకర్ రెడ్డి, కడప, అనంతపూర్, కర్నూలు పట్టభద్రుల అభ్యర్థిగా నంగరూరు రాఘవేంద్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల అభ్యర్థిగా పివిఎన్ మాధవ్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏ. వెంకట నారాయణ రెడ్డి పేర్లను బీజేపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల శాసన మండళ్లలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ జారీ చేయనుంది. నామినేషన్ల దాఖలకు ఫిబ్రవరి 23వ తేదీన గడువుగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 24వరకు గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27వ తేదీని గడువుగా నిర్ణయించారు. మార్చి 13వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మార్చి 21నాటికి ఎన్నికల ప్రక్రియను ముగిస్తారు.

Updated Date - 2023-02-14T22:22:41+05:30 IST