AP News: కాకినాడలో బీజేపీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రసాభాస
ABN , Publish Date - Dec 14 , 2023 | 02:56 PM
Andhrapradesh: కాకినాడ సామర్లకోట మండలం వేట్ల పాలెంలో బీజేపీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రసాభాసగా మారింది. గ్రామంలో వచ్చిన యాత్రను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రధాని మోడీ పంపే కేంద్ర ప్రభుత్వ పంచాయితీ నిధులు తమ గ్రామానికి రావడం లేదని ఆ నిధులు ఎక్కడికి పోయాయంటూ అధికారులను గ్రామస్తులు నిలదీశారు.
కాకినాడ: కాకినాడ సామర్లకోట మండలం వేట్ల పాలెంలో బీజేపీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర (BJP Vikasit Bharat sankalpa yatra) రసాభాసగా మారింది. గ్రామంలో వచ్చిన యాత్రను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రధాని మోడీ పంపే కేంద్ర ప్రభుత్వ పంచాయితీ నిధులు తమ గ్రామానికి రావడం లేదని ఆ నిధులు ఎక్కడికి పోయాయంటూ అధికారులను గ్రామస్తులు నిలదీశారు. అధికారులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. వారం రోజులుగా నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి మంజూరైన బోర్లకు వైసీపీ నేతలు వచ్చి కొబ్బరి కాయ కొట్టకపోతే బోరు వేయమని పంచాయతీ సెక్రటరీ అంటున్నారని మహిళలు ఆవేదన చెందారు. ఈ విషయాన్ని నియోజక వర్గ బీజేపీ నేత యార్లగడ్డ రాంకుమార్.. ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నీటి సమస్య పరిష్కరిస్తానని ఎంపీడీవో హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.