Bonda Uma: విజయవాడ భవానీపురం సీఐపై మండిపడ్డ బోండా ఉమా

ABN , First Publish Date - 2023-08-17T12:52:38+05:30 IST

విజయవాడ భవానీపురం సీఐ సలామ్ అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు.

Bonda Uma: విజయవాడ భవానీపురం సీఐపై మండిపడ్డ బోండా ఉమా

అమరావతి: విజయవాడ భవానీపురం సీఐ సలామ్ అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని టీడీపీ నేత బోండా ఉమా (TDP Leader Bonda Uma) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పేదవాళ్లకు అన్నదానం రోడ్డు ప్రక్కన చేస్తామంటే అనుమతిని ఇవ్వనని.. అరెస్ట్ చేస్తానని సీఐ అన్నారన్నారు. అదే వైసీపీ నాయకుల పుట్టిన రోజున నడిరోడ్డుపై అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోయినా వైసీపీకి జి హుజూర్ అంటూ పోలీసులు బందోబస్తు నిర్వహించారని తెలిపారు. వైసీపీ వాళ్ళు చేసిన రోడ్డు బ్లాక్ అందరికీ కనపడుతుందని.. సీఐ సలామ్‌కు కళ్ళు కనపడుటలేదేమో అని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ బ్యానర్లను వైసీపీకి జి హుజూర్ అంటూ సీఐ తొలగించటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల పని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటమా టీడీపీ బ్యానర్లను తొలగించటమా అని ప్రశ్నించారు. స్టేషన్‌కు వచ్చిన వాళ్ళను లంచాలతో వేధించటం, ప్రైవేటు సెటిల్మెంట్‌లు చేయటం వంటి సీఐ సలామ్‌పై అనేక అరోపణలు వస్తున్నాయని తెలిపారు.ర సలామ్ అవినీతి అక్రమాలపై సీపీకి పిర్యాదు చేస్తామని బోండా ఉమా పేర్కొన్నారు.

Updated Date - 2023-08-17T12:52:38+05:30 IST