Bopparaju: ప్రభుత్వ పెద్దలపై ఆగ్రహం.. ఉద్యోగులు దాచుకున్న డబ్బులెక్కడ..
ABN , First Publish Date - 2023-02-24T20:16:00+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Govt) పై ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (AP JAC Chairman Bopparaju Venkateshwarlu) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Govt) పై ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (AP JAC Chairman Bopparaju Venkateshwarlu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఒకటో తేదీన జీతాలు తీసుకోలేని దుస్థితిలో ఉన్నారని బొప్పరాజు మండిపడ్డారు. ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఉద్యోగులు దాచుకున్న డబ్బులే లేవని చెబుతున్నారని బొప్పరాజు విమర్శించారు. 20వ తేదీలోపు జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని, ఉద్యోగులు 30 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నారని బొప్పరాజు అన్నారు. ఈ నెల 26న తమ ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని బొప్పరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇటీవల జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఉద్యోగులను (Govt. Employees) హింస పెట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. సంక్రాంతి నాటికి బకాయిలు ఇస్తామని మంత్రుల కమిటీ (Ministers Committee) హామీ ఇచ్చిందని.. ఇంతవరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ (CPS) వాటా డబ్బులు 11 నెలలుగా ప్రభుత్వం వాడేసుకుందని ఆరోపించారు. ‘జీతాలు తమకు భిక్ష వేస్తున్నారా?’ అంటూ ప్రశ్నించారు.
నెల చివరి రోజు జీతాలు ఇవ్వాలని చట్టం ఉందని, 12 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు (Salaries), పెన్షన్లు (Pensions) ఇవ్వకపోతే ఎవరు సిగ్గు పడాలని బొప్పరాజు ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పట్ల సీఎం జగన్ (CM Jagan) ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఆర్టీసీ ఉద్యోగులకు (RTS Employees) ప్రమోషన్లు ఇచ్చి పూర్తి జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఉద్యోగులకు కూడా లెక్కలు ఎందుకు చెప్పడం లేదన్నారు. జీతాలు పూర్తి స్కేల్ ఇవ్వాల్సి వస్తుందని క్రమబద్దీకరణ చేయకపోవడం దారుణమన్నారు. ఉద్యోగులను గాలికి వదిలేశారని, ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌పై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆ రోజే పరిశ్రమలు మళ్లీ పరిగెత్తుకుంటూ వస్తాయి