Budha Venkanna : ముందస్తుకు వెళ్ళినా... వెనకస్తుకి వెళ్లినా గెలుపు టీడీపీదే..

ABN , First Publish Date - 2023-06-01T13:35:10+05:30 IST

ఏపీ సీఎం జగన్ అమరావతిలో పేద ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. విశాఖలో దశపల్లా భూములు, వైసీపీ నేతలు దోచుకున్న భూముల్లో పేదలకు జగన్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. అనకాపల్లి జిల్లా బయ్యారంలో వైసీపీ నేతలు అక్రమ లే అవుట్ వేశారన్నారు. 600 ఎకరాల్లో గుడివాడ అమర్, విజయ సాయి రెడ్డి బినామీలతో వెంచర్ వేశారన్నారు. గుడివాడ అమర్, విజయ సాయి రెడ్డి రికార్డులు తారుమారు చేసి...కబ్జా చేశారని ఆరోపించారు.

Budha Venkanna : ముందస్తుకు వెళ్ళినా... వెనకస్తుకి వెళ్లినా గెలుపు టీడీపీదే..

విశాఖ : ఏపీ సీఎం జగన్ అమరావతిలో పేద ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. విశాఖలో దశపల్లా భూములు, వైసీపీ నేతలు దోచుకున్న భూముల్లో పేదలకు జగన్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. అనకాపల్లి జిల్లా బయ్యారంలో వైసీపీ నేతలు అక్రమ లే అవుట్ వేశారన్నారు. 600 ఎకరాల్లో గుడివాడ అమర్, విజయ సాయి రెడ్డి బినామీలతో వెంచర్ వేశారన్నారు. గుడివాడ అమర్, విజయ సాయి రెడ్డి రికార్డులు తారుమారు చేసి...కబ్జా చేశారని ఆరోపించారు. ఎవరూ కొని మోసం పోవద్దని.. 2024 ఎన్నికల్లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని బుద్దా వెంకన్న అన్నారు.

‘‘మా కృష్ణా జిల్లాలోనే కుక్కలు ఉన్నాయని అనుకున్నాను. అరిసే కుక్కలు కరవవు. అక్కడ ఊర కుక్కలకే సమాధానంచెప్పాను. బురద పందులకు సమాధానం చెప్పలేనా? సీతారాం... మా స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తే.. ప్రజల సొమ్ము తిని పందిలా బలిశారు. చచ్చే వరకూ టీడీపీలో ఉంటానని సీతారాం అన్నారు. ఇప్పుడ బురద పందిలా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. 2019 ఎన్నికలలో తమ్మినేని గెలిచారు. 2024 ఎన్నికలో ఓటమి ఖాయం. 2024 ఎన్నికల్లో ఆముదాలవలస రోడ్డుపై అంకుశం సినిమాలో రామిరెడ్డి లాగా తమ్మినేని రోడ్డు మీద ఉండాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో తమ్మినేని పై కోన రవి కుమార్ పోటీ చేసి గెలుస్తారు. తమ్మినేని పందిలాగా బలిసి చంద్రబాబు పినిష్ చేస్తానని అంటావా? బుద్ధి ఉందా?

న్యాయ వ్యవస్థను ఎవరూ మేనేజ్ చేయలేరు. తల్లి వంకతో అవినాష్ బెయిల్ తెచ్చుకున్నారు. అవినాష్ బెయిల్ విషయంలో వ్యవస్థల్ని వైసీపీవారు మేనేజ్ చేశారా? అవినాష్ కంటే జగన్ చాలా భయపడుతున్నారు. ముందస్తుకు వెళ్ళినా... వెనకస్తుకి వెళ్లినా టీడీపీ గెలుస్తుంది. కేశినేని వ్యాఖ్యలపై నేను స్పందించను. 2 వేల రూపాయల నోట్ల కట్టలు ఇడుపాయలలో దాచారు. 2 వేల నోట్లు ఎలా మార్చాలనే పనిలో జగన్ ఉన్నారు. జగన్ ది క్రిమినల్ మైండ్.. ప్రస్తుతం ఆయన డిప్రిషన్‌లో ఉన్నారు. జనాల దగ్గరకు జగన్ డేరాలు కట్టుకొని వెళ్తున్నారు. డేరా బాబు జగన్. విజయవాడ వెస్ట్ నుంచి నేను పోటీ చేస్తాను. కాని పక్షంలో ఎక్కడ నుంచి చంద్రబాబు పోటీ చేయమంటే అక్కడ నుంచే పోటీ చేస్తాను’’ అని బుద్దా వెంకన్న తెలిపారు.

Updated Date - 2023-06-01T13:35:10+05:30 IST