CBI: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం..! సర్వత్రా ఉత్కంఠ

ABN , First Publish Date - 2023-06-29T18:38:42+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka murder case) రేపు కీలక పరిణామం చోటు చేసుకోనుంది.

CBI: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం..! సర్వత్రా ఉత్కంఠ

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka murder case) రేపు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. రేపు మధ్యంతర ఛార్జిషీటును దాఖలు చేయనున్నట్లు సీబీఐ (CBI) తెలిపింది. రేపటి సీబీఐ ఛార్జిషీటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మధ్యంతర ఛార్జిషీటులో జగన్, అవినాష్ రెడ్డి పేర్లు ప్రస్తావించనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. దర్యాప్తునకు మరింత గడువు కావాలని జులై 3వ తేదీనే సుప్రీంకోర్టును కోరాలని సీబీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జులై 3న సీజేఐ ధర్మాసనం ముందు అవినాష్ మధ్యంతర బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుంది.

ఇప్పటివరకూ జరిపిన దర్యాప్తు వివరాలన్నింటినీ సీబీఐ ఛార్జిషీటులో ప్రస్తావించనుంది. కుట్రకోణం వెలుగులోకి తెచ్చేందుకు మరింత గడువు కావాలని సీబీఐ సుప్రీంకోర్టును కోరనుంది.

కాగా.. వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case)లో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YCP MP Avinash Reddy) ఆదివారం కూడా సీబీఐ (CBI) విచారణకు హాజరయ్యారు. తనతో పాటు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్‌ (Important Documents)ను తీసుకు వచ్చారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకు రావాలని నిన్ననే అధికారులు చెప్పారు. దీంతో డాక్యుమెంట్స్‌తో సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన ఇరవై నిమిషాలు ఉండి తిరిగి వెళ్లిపోయారు.

కాగా.. అవినాష్‌ను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందుస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్ నెల చివరి వరకు.. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం అవినాష్‌కు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 10 గంటలకు సీబీఐ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. కాగా ఇప్పటికే అవినాష్ ముందోస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-06-29T19:02:10+05:30 IST