Padma Awards 2023 : పద్మ అవార్డుల ప్రకటన... తెలుగు రాష్ట్రాలకు ఇవే..
ABN , First Publish Date - 2023-01-25T21:19:37+05:30 IST
తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పద్మ అవార్డులు వచ్చాయంటే.. Central Govt Announce Padma Awards.. Telugu States Awards details
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారిని అత్యున్నత పురస్కారాలతో ఏటా కేంద్ర ప్రభుత్వం సత్కరిస్తుంది. ఈ రిపబ్లిక్ వేడుకలకు కూడా పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. మొత్తం 106 మందిని పద్మ శ్రీ అవార్డులు వరించాయి.
ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి అవార్డులు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ వరించింది వీరినే..
1. ఎంఎం కీరవాణి (సంగీతం)
2. కోట సచ్చిదానంద శాస్త్రి (హరికథ)
3. ప్రకాష్ చంద్రసూద్ (సాహిత్యం, విద్య)
4. గణేష్ నాగప్ప (సైన్స్ అండ్ ఇంజనీరింగ్)
5. సీవీ రాజు (కళలు)
6. అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్, ఇంజనీరింగ్)
7. సంకురాత్రి చంద్రశేఖర్ (సామాజిక సేవ)
తెలంగాణ పద్మాలు వీరే..
పద్మభూషణ్ గ్రహీతలు
1. చిన్నజీయర్ స్వామి - ఆధ్యాత్మికం
2. కమలేష్ డి పటేల్ - ఆధ్మాత్మికం
పద్మశ్రీ గ్రహీతలు..
1. మోదడుగు విజయ్ గుప్తా - సైన్స్ రంగం
2. పసుపులేటి హనుమంతరావు - వైద్య రంగం
3. బీ.రామకృష్ణా రెడ్డి - విద్యా సాహిత్యం.
పద్మ అవార్డు గ్రహీతలు మరికొందరి వివరాలు...
పద్మవిభూషణ్
ఉత్తరప్రదేశ్ దివంగత సీఎం ములాయంసింగ్
దివంగత ఆర్కిటెక్చర్ బాలకృష్ణ దోషి
దివంగత దిలీప్ మహలనొబిస్ (వైద్య రంగం)
ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ
శ్రీనివాస్ వర్ధన్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్)
పద్మ భూషణ్
ఎస్ ఎల్ భైరప్ప - కర్ణాటక - సాహిత్యం, విద్య
సుధామూర్తి - కర్ణాటక - సామాజిక సేవ
వాణీ జయరాం - తమిళనాడు - సంగీతం
కుమార మంగళం బిర్లా - మహారాష్ట్ర - వాణిజ్యం, పరిశ్రమలు
కపిల్ కపూర్ - ఢిల్లీ - సాహిత్యం, విద్య
పద్మశ్రీ
సామాజిక సేవ - ఔషధ రంగం
మునీశ్వర్ చందర్ దావర్ (మధ్యప్రదేశ్)
రతన్ చంద్రాకర్ (అండమాన్ నికోబర్ )
హీరాబాయి లోబి ( గుజరాత్ ) – గిరిజన సామాజిక సేవ
రామ్‌కుయివాంఘ్బే న్యుమె (అస్సాం) – సాంస్కృతిక సామాజిక సేవ
వీపీ అప్పకుట్టన్ పొడువాల్ (కేరళ) – సామాజిక సేవ
వడివేల్ గోపాల్ & మసి సదాయ్యన్ (తమిళనాడు) జంతు సంక్షేమం
వ్యవసాయం
తుల రామ్ ఉప్రెటి (సిక్కిం)
నెక్రమ్ శర్మ (హిమాచల్ ప్రదేశ్)
సాహిత్యం - విద్య
జనుమ్ సింగరాయ్ (జార్ఖండ్ )
ధనీరామ్ టోటో (పశ్చిమ బెంగాల్ )
కళలు
అజయ్ కుమార్ మాండవి (ఛత్తీస్‌గఢ్ ) – చెక్క కళాఖండాలు
దోమర్ సింగ్ కున్వార్ (ఛత్తీస్‌గఢ్ ) – నాట్యం
రాణి మచ్చయ్య (కర్ణాటక ) – జానపద నృత్యం
కేసీ రున్రెంసంగి ( మిజోరం ) – గానం
జానపద సంగీతం
మునివెంకటప్ప (కర్ణాటక)
రిసింగబోర్ కుర్కలాంగ్ ( మేఘాలయ )
మంగళ కాంతి రాయ్ ( పశ్చిమ బెంగాల్)
మోవా సుబంగ్ ( నాగాలాండ్)
చిత్రకళ
భానుబాయ్ చైతరా (గుజరాత్)
పరేశ్ రాథ్వా (గుజరాత్)
పరశురాం కొమాజి ఖునె ( మహారాష్ట్ర ) – నాటక రంగం
గులాం మహమ్మద్ జాజ్ (జమ్మూకశ్మీర్) – క్రాప్ట్స్
కపిల్ దేవ్ ప్రసాద్ (బిహార్) – వస్త్రాలంకరణ
పూర్తివివరాలను ఈ కింది డాక్యుమెంట్‌లో చూడవచ్చు...