Big Breaking: ఏసీబీ కోర్టులోనూ అదే సీన్.. చంద్రబాబు పిటిషన్లు కొట్టివేత..
ABN , First Publish Date - 2023-10-09T15:49:11+05:30 IST
స్కిల్ డెవలప్‌మెంట్ (Skill Development) అక్రమ కేసులో రిమాండ్ ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరోసారి నిరాశ ఎదురైంది.
విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ (Skill Development) అక్రమ కేసులో రిమాండ్ ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్, కస్టడీ పిటిషన్లను న్యాయమూర్తి కొట్టివేశారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి తీర్పు వెలువరించారు. మరోవైపు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం కొట్టివేసింది.