Chandrababu : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా
ABN , First Publish Date - 2023-09-26T11:45:39+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా పడింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై ఉండటంతో విచారణ రేపటికి వాయిదా పడింది.
విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా పడింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై ఉండటంతో విచారణ రేపటికి వాయిదా పడింది. కస్టడి పిటిషన్‌పై చంద్రబాబు తరపు న్యాయవాదులు దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ కౌంటర్ దాఖలు చేశారు. కేసు విచారణను ఇన్‌చార్జి న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. కాగా.. బెయిల్ పిటిషన్ అంశాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావించగా.. రేపు సీఐడీ కోర్టులో కోరాలని న్యాయమూర్తి సూచించారు.