Chandrababu : బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. ఇవాళ ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-10-12T11:24:04+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్‌మెంటు కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై ఈ రోజు హై కోర్టులో విచారణకు వచ్చింది.

Chandrababu : బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. ఇవాళ ఏం జరిగిందంటే..

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్‌మెంటు కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ తిరస్కరించిందని కోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకొచ్చారు. విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ ఈ నెల 17 వ తేదీకి వాయిదా వేసింది.

చంద్రబాబు కేసుల విషయంలో వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ కేసు విచారణ అక్టోబర్ 9న జరిగింది. ఆ రోజే చంద్రబాబుకు స్కిల్ కేసులో బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. కానీ నేటికి వాయిదా పడింది. ఇవాళ అయినా బెయిల్ లభిస్తుందని టీడీపీ శ్రేణులు ఆశతో ఉన్నాయి. ఇవాళ కూడా కేసు విచారణ 17కు వాయిదా పడటంతో నిరాశ చెందుతున్నాయి. ఇక సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడుతూనే ఉంది. ఇరు పక్షాల వాదనలూ విన్న ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. రేపయినా చంద్రబాబుకు ఊరట లభిస్తుందో లేదో చూడాలి.

Updated Date - 2023-10-12T11:25:52+05:30 IST