Chandrababu: నేను పుంగనూరు రోడ్డుపై తిరగకూడదా? మళ్లీ పుంగనూరు వస్తా

ABN , First Publish Date - 2023-08-04T19:20:32+05:30 IST

పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ (YCP Vs TDP) దాడిని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) తీవ్రంగా ఖండించారు.

Chandrababu: నేను పుంగనూరు రోడ్డుపై తిరగకూడదా? మళ్లీ పుంగనూరు వస్తా

చిత్తూరు: పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ (YCP Vs TDP) దాడిని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) తీవ్రంగా ఖండించారు.


"ఇవాళ విధ్వంసానికి పెద్దిరెడ్డి, పోలీసులు కారణం. పుంగనూరు ఘటనపై విచారణ జరిపించాలి. నేను పుంగనూరు రోడ్డుపై తిరగకూడదా?. నేను మళ్లీ పుంగనూరు వస్తా. మొన్నే పులివెందులలో పొలికేక వినిపించా. ఇప్పుడు పుంగనూరులో గర్జిస్తున్నా." అని చంద్రబాబు అన్నారు.


పుంగనూరు ఊరు బయట యుద్ధ వాతావరణం నెలకొంది. పుంగనూరు శివార్లు యుద్ధరంగాన్ని తలపిస్తున్నాయి. చంద్రబాబును ఊరిలోకి రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ నేతలు యత్నించారు. పుంగనూరు బైపాస్‌కు చంద్రబాబు కాన్వాయ్‌ చేరుకుంది. ఓపెన్‌ టాప్‌ జీపు పైనుంచే చంద్రబాబు ప్రసంగించారు. పుంగనూరు బైపాస్‌ దగ్గరకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. చంద్రబాబు పుంగనూరుకు రావాలని కార్యకర్తల డిమాండ్‌ చేశారు.


టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటన నేపథ్యంలో పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు కార్యకర్తలపై రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువులను ప్రయోగించారు. టీడీపీ కార్యకర్తలకు గాయాలవడంతో టీడీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. అన్ని ప్రయత్నాలు అయిపోవడంతో పోలీసులు పారిపోయారు.

పుంగనూరు బైపాస్ రోడ్డులో ఉద్రిక్త వాతావరణంతో వాహనాలు ఆగిపోయాయి. మళ్లీ పుంగనూరు టౌన్ లోకి టీడీపీ కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకోవడానికి భారీగా పోలీసులు తరలివస్తున్నారు. టీడీపీ కార్యకర్తలపై మళ్లీ పోలీసులు రాళ్ల దాడి చేయగా, మళ్లీ పోలీసులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి చేశారు. పుంగనూరులో పోలీసుల వజ్రా వాహనం ధ్వంసమవ్వగా, మరొక పోలీసు వాహనానికి వైసీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు.

కాశ్మీరు దృశ్యాలను తలపించేలా పుంగనూరులో దృశ్యాలు కనిపిస్తున్నాయి. రాళ్ల దాడితో పోలీసులు పుంగనూరు టౌన్‌లోకి పరుగులతో పారిపోతున్నారు. పోలీసుల్ని తరుముకుంటూ పుంగనూరులోకి వందలాదిమంది కార్యకర్తలు వెళ్తుండంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - 2023-08-04T19:51:50+05:30 IST