Chandrababu చంద్రబాబు రోడ్‌షోను అడ్డుకున్న వైసీపీ.. ఎర్రగొండపాలెంలో తీవ్ర ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-04-21T20:16:47+05:30 IST

ఎర్రగొండపాలెం పట్టణంలో టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) రోడ్ షో కొనసాగుతోంది.

Chandrababu చంద్రబాబు రోడ్‌షోను అడ్డుకున్న వైసీపీ.. ఎర్రగొండపాలెంలో తీవ్ర ఉద్రిక్తత

ప్రకాశం: ఎర్రగొండపాలెం పట్టణంలో టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) రోడ్ షో కొనసాగుతోంది. చంద్రబాబు రోడ్ షోను అడ్డుకునేందుకు మంత్రి సురేష్‌, అనుచరుల ప్రయత్నించారు. మంత్రి సురేష్‌ క్యాంప్ ఆఫీస్ దగ్గర నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. టీడీపీ శ్రేణులపై వైసీపీ మూకలు రాళ్లు రువ్వారు. రోడ్ షోలో వైసీపీ మంత్రి సురేష్‌, వైసీపీ (YCP) నేతలకు చంద్రబాబు హెచ్చరించారు. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ వైసీపీ మూకలకు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రోడ్‌షోలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఎర్రగొండపాలెంలో భారీ వర్షం పడుతోంది. వర్షంలోనూ చంద్రబాబు రోడ్ షో కొనసాగుతోంది. రోడ్‌షోలో పార్టీ శ్రేణులు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయం వద్ద రోడ్డుపైకి వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. మంత్రితోపాటు వైసీపీ నేతలు కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి, నల్లబెలూన్లతో చంద్రబాబు గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు. మంత్రి తన చొక్క విప్పిన నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు వైసీపీ చేసిన ప్లాన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి సురేష్ క్యాంపు కార్యాలయం వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇరువర్గాలను పోలీసులు అడ్డుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) శుక్రవారం ప్రకాశం జిల్లా, మార్కాపురంలో అన్నదాతలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు (Farmers), కౌలు రైతుల జీవితాలు మార్చేందుకు టీడీపీ (TDP) హయాంలో చాలా చేశామన్నారు. యాంత్రీకరణ, సబ్సిడీలు, గిట్టుబాటు ధరల ద్వారా రైతులకు మేలు చేశామని, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చిరుధాన్యాలు, ఆక్వా ఉత్పత్తులకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. పాడి పరిశ్రమకు కూడా డిమాండ్ పెరిగిందని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకి సీఎం జగన్ (CM Jagan) ఉచ్చు బిగించారని చంద్రబాబు విమర్శించారు. అమరావతికి రైతులు 33 వేల ఎకరాల భూములు ఇచ్చారన్నారు. జగన్ రాజధానికి కులం, మతం, ప్రాంతం రంగుపూసి నాశనం చేశారని మండిపడ్డారు. రైతులకు ఇన్స్యూరెన్స్ విషయంలో వైసీపీ ప్రభుత్వం అబద్దాలు చెప్పిందన్నారు. ఆనాడు తాను మొదటి సారి అసెంబ్లీలో పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశానని, సమస్యను ప్రస్తావించిన తరువాత ప్రభుత్వం ఇన్స్యూరెన్స్ చెల్లించిందన్నారు. రైతుల నుంచి వచ్చిన సూచనలను తమ మ్యానిఫెస్టోలో పెడతామన్నారు. 2014లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి రైతుకు 1.5 లక్షల రుణమాఫీ చేశామన్నారు. తాను రైతు బిడ్డనని.. తనకు రైతు కష్టాలు తెలుసునని.. వాటిని పరిష్కరిస్తానని చంద్రబాబు అన్నదాతలకు హామీ ఇచ్చారు.

Updated Date - 2023-04-21T20:16:47+05:30 IST