Chandrababu: ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

ABN , First Publish Date - 2023-05-04T22:55:23+05:30 IST

ఏలూరు జిల్లాలో టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) పర్యటిస్తున్నారు.

Chandrababu: ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

ఏలూరు: ఏలూరు జిల్లాలో టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) పర్యటిస్తున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా నందమూరులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటించారు. ధాన్యం అమ్మాలంటే ఆంక్షలు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వరి పండించిన రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అసమర్థ సీఎం జగన్ (Jagan) వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని, రైతులకు ఇచ్చే గోనె సంచుల్లో సైతం అవినీతి జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. ఎకరానికి రూ.20 వేల వరకు రైతు నుంచి దోచుకుంటున్నారని, ఏప్రిల్ 1 కల్లా గోనె సంచులు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మండిపడ్డారు. దేశంలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్నామని, రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కోనసీమ పర్యటనతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. తడిచిన ధాన్యం.. మునిగిన పొలాలను యుద్ధ ప్రాతిపాదికన మంత్రి వేణు, అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంతవరకూ అధికారులు రైతుల ముఖం చూసింది లేదు కానీ చంద్రబాబు వస్తున్నారనగానే మాత్రం హుటాహుటిన పొలాల పరిశీలనకు వెళ్లిరారు. చంద్రబాబు పర్యటన ఉండడంతో రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తం కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపు చంద్రబాబు పర్యటించనున్న వేగాయమ్మ పేటలో అధికారులు ముందుగానే పర్యటిస్తూ.. రైతులను ఆదుకుంటామని రోడ్డెక్కవద్దని వారిపై ఒత్తిడి తెస్తున్నారు.

ఇప్పటికే దాదాపు 25 వేలకు పైగా మెట్రిక్‌ టన్నుల ధాన్యం అకాల వర్షాలకు దెబ్బతింది. వందలాది మంది రైతులు నష్టాల పాలయ్యారు. కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు గాని పరామర్శించిన పాపాన పోలేదు. జిల్లా స్థాయి అధికారులు ఆ వైపు చూడనే చూడలేదు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉమ్మడి పశ్చిమలో రైతులు విలవిలలాడిపోయారు. ఈ తరుణంలోనే చంద్రబాబు నీట మునిగిన పంట పొలాల పరిశీలనకు వెళ్లనున్నారు. తడిసి ముద్దయిన వరి పొలాలను సందర్శించి రైతులతో నేరుగా భేటీ అవుతారు. ఈ మేరకు తెలుగుదేశం కార్యాచరణ ప్రకటించింది. ఉమ్మడి పశ్చిమలో చంద్రబాబు పర్యటనకు రైతులంతా సంఘీభావం ప్రకటించేలా కార్యచరణ సిద్ధం చేశారు.

Updated Date - 2023-05-04T22:55:23+05:30 IST