CID ADG: అందుకే చంద్రబాబును అరెస్టు చేశాం
ABN , First Publish Date - 2023-09-13T18:54:11+05:30 IST
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో (skill development case) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు (Chandrababu) పూర్తి సంబంధం ఉంది కాబట్టే అరెస్టు చేశామని సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ (CID chief N Sanjay) స్పష్టం చేశారు.
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో (skill development case) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు (Chandrababu) పూర్తి సంబంధం ఉంది కాబట్టే అరెస్టు చేశామని సీఐడీ అడిషనల్ డీజీ ఎన్ సంజయ్ (CID ADG Sanjay) స్పష్టం చేశారు.
"మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు, రిమాండ్ అనంతరం చాలా ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. సాధారణంగా కేబినెట్ అనుమతి తర్వాత కార్పొరేషన్ నిధులు షెల్ కంపెనీలకు అటు నుంచి వ్యక్తులకు వెళ్ళాయి. ఒక ప్రైవేటు వ్యక్తికే చాలా పదవులు ఇవ్వడం, కేబినెట్ అనుమతి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. టీడీపీకి చెందిన జే. వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని సీఏగా నియమించారు. ఈ వ్యవహారంలో మొత్తం 13 చోట్ల చంద్రబాబు సంతకాలు ఉన్నాయి. బడ్జెట్ అనుమతితో పాటు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాల ఏర్పాటు, కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం తదితర అంశాలపై చంద్రబాబు సంతకాలు చేశారు. జీవోలో 90 - 10 శాతం వాటాలను పేర్కొన్నారు. కానీ ఒప్పందంలో లేదు. ఇది దురుద్దేశంతో కూడుకున్న నిర్ణయమే." అని సీఐడీ అడిషనల్ డీజీ చెప్పారు.
"సేమెన్స్ కంపెనీ ఇండియా ఎండీ కూడా 164 స్టేట్ మెంట్ ఇచ్చారు. రూ. 58 కోట్లు మాత్రమే మాకు వచ్చాయని సిమెన్స్ సంస్థ పేర్కొంది. రూ. 241 కోట్లు నేరుగా షెల్ కంపెనీలకు వెళ్లిపోయాయి. మిగతా డబ్బులు మాత్రమే కేంద్రాల ఏర్పాటుకు ఖర్చు చేశారు. ఇక్కడ నేరంలో ఇమిడి ఉన్న డబ్బు 241 కోట్లు. డిజైన్ టెక్ ద్వారా డబ్బులు వెళ్లిపోయాయి. రూ. 58 కోట్లతో కొనుగోలు చేసి రూ. 2800 కోట్లు గా చూపించారు. గుజరాత్ లో 85-15 శాతం మోడల్‌లో ఒప్పందాలు జరిగాయి. గుజరాత్‌లో 85 శాతం పరికరాలు క్షేత్ర స్థాయిలో ఉన్నాయి. ఇందులో కొందరు అధికారులు కూడా ఉన్నారు. ఏపీలో రూ.2800 కోట్ల సాప్ట్ వేర్ గాల్లో మాత్రమే కనిపిస్తోంది. ఈడీ, సీఐడీ సుమన్ బోస్, వికాస్ కన్వెల్కర్ లను అరెస్టు చేసింది. ప్రస్తుతం వారు బెయిల్‌పై ఉన్నారు. డిజైన్ టెక్‌కు చెందిన రూ. 32 కోట్లు ఈడీ సీజ్ చేసింది." అని ఎన్ సంజయ్ తెలిపారు.