Share News

Chandrababu: రజినీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ABN , Publish Date - Dec 12 , 2023 | 10:05 AM

Andhrapradesh: సూపర్ స్టార్ రజినీకాంత్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు బర్త్‌డే విషెస్ తెలియజేశారు.

Chandrababu: రజినీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

అమరావతి: సూపర్ స్టార్ రజినీకాంత్‌కు (Super star Rajinikanth) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ‘‘నా స్నేహితుడు రజినీకాంత్ విజయాల పరంపర కొనసాగాలి. ఆయురారోగ్యాలతో రజినీకాంత్ జీవితం ఆనందంగా సాగాలి’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌తో దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ చంద్రబాబు బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈరోజు 73 ఏళ్ళ వయసులో అడుగిడుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్‌కు అభిమానులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

The video is not available or it's processing - Please check back later.

Updated Date - Aug 10 , 2024 | 04:31 PM