Chandrababu : ‘నాటు నాటు’ పాట చరిత్ర సృష్టించింది
ABN , First Publish Date - 2023-03-13T09:08:58+05:30 IST
ఉత్తమ ఒరిజినల్ పాట క్యాటగిరీలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకుని చరిత్ర సృష్టించిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
అమరావతి : ఉత్తమ ఒరిజినల్ పాట క్యాటగిరీలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకుని చరిత్ర సృష్టించిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగు పాట ఈ ఘనత సాధించటం భారతీయ సినిమాకు గర్వకారణమన్నారు. రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రాంచరణ్, సింప్లీగంజ్, చంద్రబోస్, ప్రేమరక్షిత్, కాలభైరవ చిత్ర బృందం మొత్తానికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఉత్తమ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ బృందానికి ఆయన శుభాభినందనలు తెలియజేశారు.
తెలుగు పాట ‘నాటు నాటు’ ఆస్కార్ అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించింది. మొదటి సారిగా ఒక తెలుగు పాట ఇలా ఆస్కార్ గెలుచుకోవటం ఇదే మొదటిసారి. భారత దేశానికి చెందిన వారు ఎంతమంది ఆస్కార్ గెలుచుకున్నారు అంటే వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలాంటిది ఒక తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ లోని ఈ పాటకి ఆస్కార్ రావటం భారత దేశానికే గర్వ కారణం. దర్శకుడు భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా రాజమౌళి మారిపోయారు. దక్షిణాది నుంచి ఆస్కార్ గెలుచుకున్న తొలి చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది.