Srinivasa Setu: నిర్మాణంలో అపశృతి
ABN , First Publish Date - 2023-07-27T02:06:10+05:30 IST
శ్రీనివాస సేతు( Srinivasa Setu) నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. ఫ్లె ఓవర్ రెయిలింగ్‌ను పెట్టే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
తిరుపతి(Tirupati): శ్రీనివాస సేతు( Srinivasa Setu) నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. ఫ్లె ఓవర్ రెయిలింగ్‌ను పెట్టే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.70 టన్నుల సెగ్మెంట్ కింద పడి ఆప్కాన్స్(Opcons) సంస్థకు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులు బీహార్ రాష్ట్రం కథియార్ జిల్లాకు చెందిన బార్థో మండల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన అవిజిత్ ఘోష్‌గా గుర్తించారు.500 టన్నుల బరువు ఎత్తే క్రైన్ తీగలు తెగిపోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. భారీ యంత్రాలతో విరిగిన రెయిలింగ్‌ను అధికారులు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంపై సీఐ ఓబులేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.