Gudivada amarnath: ఏపీ నుంచీ ఏ పరిశ్రమ వెళ్లడం లేదు.. కాకపోతే..!
ABN , First Publish Date - 2023-08-19T16:07:38+05:30 IST
రాష్ట్రం నుంచి ఏ పరిశ్రమ వెళ్లడం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada amarnath) అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. విస్తరణలో భాగంగానే పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని తెలిపారు.
తిరుమల: రాష్ట్రం నుంచి ఏ పరిశ్రమ వెళ్లడం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada amarnath) అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. విస్తరణలో భాగంగానే పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉందన్నారు. సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ప్రతీ 40 కిలోమీటర్ల పరిధిలో ఫిషింగ్ హార్బర్ కానీ పోర్టును కానీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రంలో 6 పోర్టులు ఉండగా.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత నాలుగేళ్లలో 4 పోర్టులతో పాటు 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేస్తున్నట్లు వెల్లడించారు. రూ.15 వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా పోర్టు నిర్మాణాలు చేస్తుండగా.. రూ.3500 వేల కోట్లతో ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు.