Share News

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. ఇవాళ తిరుమలలో పరిస్థితి ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2023-12-01T08:38:16+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. కాగా.. నేడు (శుక్రవారం) తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పట్టింది.

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. ఇవాళ తిరుమలలో పరిస్థితి ఎలా ఉందంటే..

తిరుమల : టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. కాగా.. నేడు (శుక్రవారం) తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. నిన్న శ్రీవారిని 58,278 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

నేడు తిరుమల శ్రీవారిని చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. అనంతరం నేటి మధ్యాహ్నం తిరుమల నుంచి చంద్రబాబు అమరావతికి వెళ్లనున్నారు. రేపు విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు దర్శించుకోనున్నారు. ఎల్లుండి సింహాచలం అప్పన్నను దర్శించుకోనున్నారు. ఈ నెల 5న శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు.

Updated Date - 2023-12-01T08:38:18+05:30 IST