Tirumala: తిరుమలలో డిప్యూటీ సీఎం నారాయణస్వామికి చేదు అనుభవం

ABN , First Publish Date - 2023-03-01T17:58:25+05:30 IST

తిరుమలలో (Tirumala) డిప్యూటీ సీఎం నారాయణస్వామి (Deputy CM Narayanaswamy)కి చేదు అనుభవం ఎదురైంది.

Tirumala: తిరుమలలో డిప్యూటీ సీఎం నారాయణస్వామికి చేదు అనుభవం

తిరుమల: తిరుమలలో (Tirumala) డిప్యూటీ సీఎం నారాయణస్వామి (Deputy CM Narayanaswamy)కి చేదు అనుభవం ఎదురైంది. శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలికి వస్తున్న సమయంలో నారాయణస్వామిని భక్తురాలు నిలదీసింది. తిరుమలలో ఏర్పాట్లు ఏమీ బాగోలేవని మహిళా భక్తురాలు మంత్రికి వివరించారు. గదులు కేటాయింపు కేంద్రం దగ్గర అపరిశుభ్రత నెలకొందని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేద్దామంటే టీటీడీ ఈవో అందుబాటులో లేరని భక్తురాలు పేర్కొంది. భక్తురాలికి డిప్యూటీ సీఎం దండం పెట్టి ఈ ఘటన నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. తిరిగి భక్తురాలు క్యూలైన్లపై మాట్లాడేందుకు ప్రయత్నించడంతో డిప్యూటీ సీఎం స్పందిస్తూ మీ సమస్యలను ఈవో దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

ఇటీవల చిత్తూరు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి సొంతూరు కార్వేటినగరం మండలం అన్నూరు గ్రామ పంచాయతీకి చెందిన వైసీపీ ఎంపీటీసీ పొన్నుస్వామి రాజీనామా చేశారు. పార్టీలో కనీస గౌరవం దక్కకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనకు మంత్రి నారాయణస్వామి చిన్నాన్న కావడం గమనార్హం!. ఈ సందర్భంగా పొన్నుస్వామి మీడియాతో మాట్లాడుతూ ‘నా సెగ్మెంట్‌లో రెండు పంచాయతీలున్నాయి. డిప్యూటీ సీఎం నారాయణస్వామి సహకారంతోనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని, ఆయన తనకు చిన్నాన్న అవుతారని, ఆయన ఆదరించాడని పొన్నుస్వామి చెప్పారు. ఎంపీటీసీ పదవి వచ్చేలా చేశాడని విలువ ఇవ్వకుంటే ఎలా?అని, తన సెగ్మెంట్‌ పరిధిలోని 79 మందికి సుమారు ఏడాది కిందట ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఇంతవరకు వారికి స్థలం చూపించలేదన్నారు. తన సెగ్మెంట్‌ పరిధిలో ఓ ఫ్యాక్టరీ ప్రారంభం కానున్న విషయం కూడా తనకు ఇంతవరకు తెలియదన్నారు. ఇక తనకు విలువేముంది? అని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పుకునేందుకు వెళితే.. విని పరిష్కరించే నాయకులు మండలం నుంచి జిల్లా వరకు ఏ స్థాయిలోనూ లేరన్నారు. అలంకారప్రాయంగా ఉండే ఈ పదవి తనకు వద్దన్నారు. అందుకే రాజీనామా ప్రకటించానని అని వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి

సీఎం జగన్‌పై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నా..సూసైడ్ లేఖలో సాత్విక్

తిరుమలలో డిప్యూటీ సీఎం నారాయణస్వామికి చేదు అనుభవం

Updated Date - 2023-03-01T18:14:34+05:30 IST