Chittoor Dist: నగరి సీఐ వాసంతి బూతుపురాణం...

ABN , First Publish Date - 2023-02-15T12:17:37+05:30 IST

చిత్తూరు జిల్లా: నగరి సీఐ వాసంతి (CI Vasanti) అనుచితంగా ప్రవర్తించారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగిన టీడీపీ నేతల (TDP Leaders)పై బూతులు ప్రయోగించారు.

Chittoor Dist: నగరి సీఐ వాసంతి బూతుపురాణం...

చిత్తూరు జిల్లా: నగరి సీఐ వాసంతి (CI Vasanti) అనుచితంగా ప్రవర్తించారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగిన టీడీపీ నేతల (TDP Leaders)పై బూతులు ప్రయోగించారు. సీఐ వాసంతి తీరుపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మంత్రి రోజా (Minister Roja)కు నిన్న (మంగళవారం) సాయంత్రం చీర, గాజులు సారెగా ఇవ్వటానికి వెళ్లిన టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. అర్ధరాత్రి 2

గంటల సమయంలో జడ్జి వద్ద హాజరు పర్చగా ఈనెల 28వ తేదీ వరకు రిమాండ్ విధించారు.

కాగా మంత్రి రోజాకు సారె ఇచ్చేందుకు తెలుగు మహిళలు మంగళవారం నగరిలోని ఆమె ఇంటికి వెళ్లారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. తొలుత వచ్చిన సుమారు 20 మందిని మంత్రి ఇంటి వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు తరిమేశారు. తర్వాత మంత్రి ఇంటి వెనుక వైపు నుంచి చీర, సారె పెట్టడానికి వచ్చిన టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి మీర, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అరుణను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేస్తారంటూ పోలీసుల వాహనాన్ని మహిళలు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల ఇంటికి వెళ్లే హక్కు లేదా అంటూ తెలుగు మహిళ జిల్లా కార్యదర్శి లక్ష్మీప్రసన్న తదితరులు ప్రశ్నించారు.

‘రోజమ్మా, పదవులు ఎల్లకాలం ఉండవు. చంద్రబాబు ఏటా ఆయన ఆస్తులను ప్రకటిస్తున్నారు. మీరూ ప్రకటించండి. లోకేశ్‌ను విమర్శిస్తావా..? అందుకే చీర, సారె తెచ్చాం’ అని అన్నారు. మంత్రి రోజాకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై వెళ్లారు. అదే సమయంలో పోలీసులు అరుణ, మీరతో పాటు ఒంగోలుకు చెందిన రమేష్‌, పుత్తూరుకు చెందిన హమీద్‌, వెంకటగిరికి చెందిన విశ్వనాథన్‌నూ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసి టీడీపీ, వైసీపీ నాయకులూ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లారు. ‘మంత్రి రోజా ఇంటికెళ్లే ధైర్యం మీకెక్కడిది? వారిని అరెస్టుచేసి శిక్షించండి’ అంటూ వైసీపీ శ్రేణులు నినదించారు. ‘మా నాయకుడికి చీర, గాజులు ఇస్తామన్న రోజాకు.. సారె, గాజులు ఇవ్వడానికి తెలుగు మహిళలు వెళ్లారు. ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లకూడదా?’ అంటూ టీడీపీ వారు ఎదురు తిరిగారు.

పోలీస్ స్టేషన్ ముందు ఇరు వర్గాల వాగ్వాదాలతో ఉద్రిక్తత నెలకొంది. సీఐలు శ్రీనివాసంతి, రాజశేఖర్‌ తమ సిబ్బందితో కలిసి ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌ నుంచి బయటకు పంపగా, రోడ్డుపై నిలిచిపోయారు. వాళ్లు వెళ్తే మేము వెళ్తామంటూ రెండు పార్టీల వారూ ఒకరిపై ఒకరు చెప్పుకొంటూ పోలీసు స్టేషన్‌ ముందు రోడ్డుపై నిలిచిపోయారు. అదే సమయంలో వడమాలపేటకు చెందిన టీడీపీ నేత ధనంజయలు నాయుడు తన వాహనంలో అటు వైపు వచ్చారు. వైసీపీ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు ధనంజయలు నాయుడిని పోలీస్ స్టేషన్‌లోకి తీసుకెళ్లారు. రోడ్డుపైనే ఇరువర్గాలు నినాదాలు చేసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో అటు వైపుగా వచ్చిన కొందరు తెలుగు మహిళలను మీరెందుకు వచ్చారంటూ వైసీపీ నాయకులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2023-02-15T12:17:41+05:30 IST