పులివర్తి నాని ఆమరణ దీక్ష ను భగ్నం చేయడానికి పోలీసుల యత్నం.. పెట్రోల్ పోసుకుంటానంటూ..

ABN , First Publish Date - 2023-07-31T12:58:10+05:30 IST

చంద్రగిరి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా నిరోధించే వరకూ ఆమరణ నిరాహారదీక్ష కొన సాగిస్తానని చంద్రగిరి టీడీపీ ఇన్ చార్జీ పులివర్తి నాని ఆమరణ దీక్షకు దిగారు. అయితే ఆయన దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు యత్నించారు. ఆమరణ దీక్ష భగ్నం చేస్తే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ బాటిల్ పక్కన పెట్టుకుని మరీ దీక్షకు పులివర్తి నాని కూర్చున్నారు.

పులివర్తి నాని ఆమరణ దీక్ష ను భగ్నం చేయడానికి పోలీసుల యత్నం.. పెట్రోల్ పోసుకుంటానంటూ..

తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా నిరోధించే వరకూ ఆమరణ నిరాహారదీక్ష కొన సాగిస్తానని చంద్రగిరి టీడీపీ ఇన్ చార్జీ పులివర్తి నాని ఆమరణ దీక్షకు దిగారు. అయితే ఆయన దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు యత్నించారు. ఆమరణ దీక్ష భగ్నం చేస్తే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ బాటిల్ పక్కన పెట్టుకుని మరీ దీక్షకు పులివర్తి నాని కూర్చున్నారు. చంద్రగిరి మండలం, రెడ్డివారిపల్లె స్వర్ణముఖి నదిలో ఇసుక రీచ్‌లో తీసిన గోతిలో పడి కర్నూల్‌కు చెందిన విద్యార్థి కార్తిక్ (19) మృతి చెందాడు. కార్తీక్.. చంద్రగిరిలోని వెంకట పద్మావతి బ్యాచిలర్ కోర్స్ చేసేవాడు.

అయితే స్వర్ణముఖినదిలో కార్తీక్ మృతి, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని పులివర్తి నాని ఆరోపిస్తున్నారు. విద్యార్థి మృతికి స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలన్నారు. ఇసుక అక్రమ రవాణా దారులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని పులివర్తి నాని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాతో రోజుకు కోటి అక్రమంగా సంపాదిస్తున్నారని.. స్వర్ణముఖి నది చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జల వనరులు దెబ్బతింటున్నాయన్నారు. ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహించిన అధికారులను సస్పెండ్ చేయాలని పులివర్తి నాని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-07-31T12:58:10+05:30 IST