NaraLokesh: వాల్మీకిలకి వెన్నుపోటు పొడిచిన జగన్
ABN , First Publish Date - 2023-02-01T11:39:16+05:30 IST
‘‘యువగళం’’ పాదయాత్రలో భాగంగా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలం బేలుపల్లెలో వాల్మీకి సామాజిక వర్గం ప్రతినిధులతో టీడీపీ నేత నారా లోకేష్ సమావేశమయ్యారు.
చిత్తూరు: ‘‘యువగళం’’ పాదయాత్ర (NaraLokesh Padayatra) భాగంగా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలం బేలుపల్లెలో వాల్మీకి సామాజిక వర్గం ప్రతినిధులతో టీడీపీ నేత నారా లోకేష్ (YuvaGalam Padayatra) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వల్ల తాము ఎలాంటి ఇబ్బందు పడుతున్నామో లోకేష్ (NaraLokesh) కు వాల్మీకి సోదరులు వివరించారు. వాల్మీకిలను జగన్ నమ్మించి మోసం చేశారన్నారు. ఎస్టీల్లో చేర్చే అంశంపై అసలు స్పందించడం లేదని తెలిపారు. ‘‘రుణాలు లేవు, ఉద్యోగాలు లేవు. గ్రామాల్లో వాల్మీకి యువత కర్ణాటక, తమిళనాడు వెళ్లి బ్రతుకుతున్నాం’’ అంటూ వాల్మీకి సోదరులు ఆవేదన చెందారు.
వాల్మీకిలకు లోకేష్ అభయం...
వాల్మీకిల సమస్యలు విన్న లోకేష్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వాల్మీకిలకి జగన్ రెడ్డి (AP CM JaganMohan Reddy) వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సత్యపాల్ కమిటీ ఏర్పాటు చేసి వాల్మీకిల స్థితిగతులపై అధ్యయనం చేశామని గుర్తుచేశారు. వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చాలని 2017లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం (Central Government)వద్దకు పంపినట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రధాని మోదీ (PM Narendra Modi)కి చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చాలని పోరాడుతూ లేఖ రాశారన్నారు. వైసీపీ (YCP)కి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నా వాల్మీకిల గురించి మాట్లాడటం లేదని... పోరాటం చేయలేదని విమర్శించారు. టీడీపీ (TDP)అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో లోన్లు ఇచ్చామని ఆయన అన్నారు.
వైసీపీ పాలనలో ఒక్క వాల్మీకికి రుణం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక వాల్మీకిలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనులు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఆరుగురు పారిశ్రామికవేత్తలు మాట్లాడితే అందులో నాలుగు కంపెనీలు టీడీపీ హయాంలో వచ్చాయని తెలిపారు. ఒక్కటి వైఎస్, ఒక్కటి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో వచ్చాయని.. జగన్ హయాంలో వచ్చింది సున్నా అని వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి సోదరులకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించడం కోసం కంపెనీలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా... జగన్ ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి చెయ్యాలని జగన్ రెడ్డికి తాను స్వయంగా లేఖ రాసినట్లు లోకేష్ పేర్కొన్నారు.