Tirumala : మార్చిలో రికార్డ్ స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం..

ABN , First Publish Date - 2023-04-07T11:13:14+05:30 IST

శుక్రవారం శ్రీవారి ఆలయంలో సమయా భావం కారణంగా నిజపాద దర్శనాన్ని పున్నరుద్దరించలేమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

Tirumala : మార్చిలో రికార్డ్ స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం..

తిరుమల : శుక్రవారం శ్రీవారి ఆలయంలో సమయా భావం కారణంగా నిజపాద దర్శనాన్ని పున్నరుద్దరించలేమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అరవింద్ నేత్రాలయంలో ఐ బ్యాంకు పెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్నదానంలో నాణ్యతని పెంచేందుకు ఇక పై టెండర్ల ద్వారా కాకుండా మిల్లర్ల ద్వారా బియ్యాని సేకరిస్తామన్నారు. సుదర్శనం సత్రాల స్థానంలో నూతన అతిధిగృహలను నిర్మిస్తామని ధర్మారెడ్డి వెల్లడించారు. మార్చి మాసంలో 20లక్షల 57వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. ఈ సారి మార్చి నెలలో హుండీ ఆదాయం రికార్డ్ స్థాయికి చేరింది. హుండీ ద్వారా రూ.120.29 కోట్ల ఆదాయం లభించిందని ధర్మారెడ్డి వెల్లడించారు. కోటి 2లక్షల లడ్డులను భక్తులకి విక్రయించామని తెలిపారు. 38 లక్షల 17వేల మంది భక్తులకి అన్నప్రసాద వితరణ చేశామన్నారు. 8.25 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారని ధర్మారెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-04-07T11:41:52+05:30 IST