Tirumala: నవంబర్‌లో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?..
ABN , First Publish Date - 2023-12-01T10:34:51+05:30 IST
Andhrapradesh: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీనివాసుడిని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. దేశ, విదేశాల నుంచి భక్తులు స్వామి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటారు. వారాంతరాలు, సెలవుల రోజుల్లో సాధారణ రోజు కంటే భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటారు. న
తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీనివాసుడిని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. దేశ, విదేశాల నుంచి భక్తులు స్వామి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటారు. వారాంతరాలు, సెలవుల రోజుల్లో సాధారణ రోజు కంటే భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటారు. నవంబర్ మాసంలో 19.73 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా శ్రీవారికి రూ.108.64 కోట్ల ఆదాయం లభించింది. 97.47 లక్షల లడ్డులను భక్తులకు టీటీడీ విక్రయించింది. అలాగే 36.50 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దాదాపు 7.06 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.