Tirumala : వామ్మో.. ఇవాళ శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లన్నీ నిండి ఎక్కడి వరకూ క్యూలైన్ ఉందంటే..
ABN , First Publish Date - 2023-05-01T07:14:36+05:30 IST
నిన్న ఆదివారం.. ఇవాళ మేడే కారణంగా సెలవు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు.
Tirumala : నిన్న ఆదివారం.. ఇవాళ మేడే కారణంగా సెలవు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. నేడు (సోమవారం) స్వామివారి సర్వదర్శనం కోసం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి ఆల్వార్ ట్యాంక్ క్యూ లైన్ వరకూ భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,582 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.19 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 43,526 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.