Share News

Tirumala : తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2023-10-19T07:41:10+05:30 IST

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు తిరుమలలో శ్రీవారికి గరుడ సేవ కొనసాగనుంది. నేడు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది.

Tirumala : తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే..

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి నేడు 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.56 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు తిరుమలలో శ్రీవారికి గరుడ సేవ కొనసాగనుంది. నేడు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది. గరుడ సేవకు భక్తుల రద్దీ దృష్ట్యా టోకెన్లు నిలిపివేసింది. ఐదోరోజు మోహినీ అవతారంలో భక్తులకు శ్రీనివాసుడి దర్శనం లభించనుంది. సాయంత్రం గరుడ వాహనంపై భక్తులకు కోనేటిరాయుడి దర్శనం ఇవ్వనున్నారు.

Updated Date - 2023-10-19T07:49:54+05:30 IST