CI Swarnalatha: నోట్లు మార్పిడి కేసులో పోలీస్ కస్టడీకి సీఐ స్వర్ణలత

ABN , First Publish Date - 2023-07-13T17:36:43+05:30 IST

నోట్లు మార్పిడి కేసులో (currency exchange case) రిజర్వ్‌ మహిళా ఇన్‌స్పెక్టర్‌ బి.స్వర్ణలతను (CI Swarnalatha) న్యాయస్థానం పోలీస్ కస్టడీకి (police custody) అప్పగించింది.

CI Swarnalatha: నోట్లు మార్పిడి కేసులో పోలీస్ కస్టడీకి సీఐ స్వర్ణలత

విశాఖపట్నం: నోట్లు మార్పిడి కేసులో (currency exchange case) రిజర్వ్‌ మహిళా ఇన్‌స్పెక్టర్‌ బి.స్వర్ణలతను (CI Swarnalatha) న్యాయస్థానం పోలీస్ కస్టడీకి (police custody) అప్పగించింది. 2 వేల నోట్ల దందా కేసులో ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలతను ఒక్కరోజు విచారణ కోసం పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చినట్లు కోర్టు పేర్కొంది. సీఐ స్వర్ణలతతో పాటు మరో ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు. ఏంవీపీ పోలీస్ స్టేషన్‌లో నాలుగు గంటలుగా విచారణ కొనసాగుతోంది. విశ్రాంత నేవి అధికారులతో ఎలా పరిచయం ఏర్పడింది? మోసం చెయ్యాలని పిలిచారా ? అని స్వర్ణలతను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సూరితో స్వర్ణలతకు ఉన్న పరిచయంపై పోలీసులు అరా తీస్తున్నారు.


నోట్ల మార్పిడి కేసులో అరెస్టయిన రిజర్వ్‌ మహిళా ఇన్‌స్పెక్టర్‌ బి.స్వర్ణలతతో పాటు ఏఆర్‌ కానిస్టేబుల్‌ హేమసుందర్‌ అలియాస్‌ మెహర్‌ను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. శనివారం విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్రమవర్మ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్‌ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారిని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు సీపీ ఒక ప్రకటన జారీ చేశారు. పోలీసులు చట్ట ప్రకారం విధులు నిర్వర్తించాలని, కేసుల పరిష్కారంలో పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విశ్రాంత నేవీ అధికారులను బెదిరించి రూ.12 లక్షలు కాజేశారనే అభియోగంపై స్వర్ణలత, ఆమె వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ మెహర్‌, హోం గార్డు శ్రీనుతో పాటు బ్రోకర్‌గా వ్యవహరించిన సూరిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు వారికి రెండు వారాలు రిమాండ్‌ విధించింది.

Updated Date - 2023-07-13T17:38:11+05:30 IST