Chandrababu arrest: దీన్నేమంటారు సంజయ్‌!

ABN , First Publish Date - 2023-09-15T04:36:28+05:30 IST

‘‘ఘంటా సుబ్బారావు అనే ఒక ప్రైవేటు వ్యక్తిని అక్రమంగా ప్రభుత్వంలోకి తెచ్చిపెట్టారు’’ అంటూ బుధవారం జరిగిన పత్రికా సమావేశంలో సీఐడీ చీఫ్‌ సంజయ్‌ తీవ్రమైన ఆరోపణ చేశారు. అయితే, ఇప్పుడు జగన్‌ ప్రభుత్వంలో జరుగుతున్నదేమిటో ఆయనకు తెలియదా అని పలువురు సూటిగా

Chandrababu arrest: దీన్నేమంటారు సంజయ్‌!

ఘంటా సుబ్బారావు ప్రైవేటు వ్యక్తైతే

దువ్వూరి కృష్ణ, హరికృష్ణ ఎవరు?

జగన్‌ హయాంలోనే అనామకులకు అందలం

ఘంటా, కేఎల్‌ఎన్‌ వారి విభాగాల్లో

అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు

బాబు 3 పోస్టులిస్తే, వైఎస్‌ 4 పోస్టులిచ్చారు
‘జవహర్‌ నాలెడ్జ్‌’ సృష్టికర్త కేఎల్‌ఎన్‌

అమరావతి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘‘ఘంటా సుబ్బారావు అనే ఒక ప్రైవేటు వ్యక్తిని అక్రమంగా ప్రభుత్వంలోకి తెచ్చిపెట్టారు’’ అంటూ బుధవారం జరిగిన పత్రికా సమావేశంలో సీఐడీ చీఫ్‌ సంజయ్‌ తీవ్రమైన ఆరోపణ చేశారు. అయితే, ఇప్పుడు జగన్‌ ప్రభుత్వంలో జరుగుతున్నదేమిటో ఆయనకు తెలియదా అని పలువురు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒక సాదాసీదా డాక్టరు ఎం.హరికృష్ణకు జగన్‌ సర్కార్‌ ఏకంగా మూడు పోస్టులు కట్టబెట్టింది. ఆయన ప్రైవేటు వ్యక్తి కాదా? సీఎంవోలో స్పెషల్‌ ఆఫీసర్‌గా, ఆరోగ్య శ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా మూడు పోస్టుల్లో నియమించింది. సంజయ్‌ వ్యాఖ్యల ప్రకారం ప్రైవేటు వ్యక్తి ఘంటా సుబ్బారావుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మూడు పోస్టులు ఇవ్వడం తప్పైతే హరికృష్ణకు మూడు పోస్టులు కట్టబెట్టడం కూడా తప్పే. మూడు పోస్టులు కట్టబెట్టడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే హోదాను కూడా హరికృష్ణ పేరుముందు చేర్చడానికి జగన్‌ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడలేదు. జగన్‌ సర్కారులో మరో వివాదాస్పద పోస్టింగ్‌ దువ్వూరి కృష్ణకు ఇచ్చారు. స్పెషల్‌ సెక్రటరీ అనే హోదాను దువ్వూరి పేరు ముందు తగిలించి మరీ సీఎంవోలోకి తీసుకున్నారు. సీఎం స్పెషల్‌ సెక్రటరీ హోదా ఇచ్చారు.

ప్రభుత్వ వ్యవస్థల్లో సెక్రటరీ అనే పోస్టు, హోదా చాలా కీలకం. ఆలిండియా సర్వీసు అధికారులకి, కన్ఫర్డ్‌ ఐఏఎ్‌సలకు మాత్రమే ఈ హోదా ఉంటుంది. మరి అలాంటిది ఒక ప్రైవేటు వ్యక్తికి ఏకంగా స్పెషల్‌ సెక్రటరీ హోదా కట్టబెట్టడం సంజయ్‌కి తప్పనిపించలేదా? జగన్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎంవోలోకి తీసుకున్న అధికారులకు స్టాఫ్‌ను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నంబర్‌ 73 విడుదల చేసింది. అందులో కల్లం అజేయ రెడ్డి, పీవీ రమేశ్‌, సోలోమన్‌ ఆరోక్య రాజ్‌, ధనుంజయ్‌ రెడ్డి, జె.మురళి ఉన్నారు. వీళ్లంతా ఐఏఎ్‌సలు. వీరితోపాటు ఆ జీవోలోని జాబితాలో దువ్వూరి కృష్ణ పేరును జత చేశారు. ఇతను నాన్‌ ఐఏఎస్‌. ఒక ప్రైవేటు వ్యక్తిని ఐఏఎ్‌సలతో సమానంగా చూడడం సంజయ్‌కి తప్పనిపించలేదా? పైగా దువ్వూరి కృష్ణకు ప్రొటోకాల్‌-పీ వర్తింపజేస్తూ మరో ప్రత్యేక జీవో ఇచ్చారు. ప్రొటోకాల్‌ పీ అంటే, ఆ వ్యక్తికి వేతనం, ప్రత్యేక వాహనంతో పాటు, అతని సిబ్బందికి కూడా వేతనం ప్రభుత్వమే ఇస్తుంది. వెహికల్‌ అలవెన్సు, ఫోన్‌ డేటా బిల్లు, ఇంటి అద్దె, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, విమాన ప్రయాణాల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. 2019 ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన పేరుతో హరికృష్ణ జగన్‌ కోటరీలో చేరారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సోలార్‌ ప్రాజెక్టులన్నీ గతంలో దువ్వూరి కృష్ణ పనిచేసి వచ్చిన గ్రీన్‌కో కే దక్కాయి.


రిటైర్‌ అయినా అదే పోస్టులో..!

ఐఏఎ్‌సలుగా ప్రభుత్వంలో పనిచేసి రిటైర్‌ అయ్యాక అధికారులు వెళ్లిపోవాలి. లేదా సలహాదారులుగా వారి సేవలు ప్రభుత్వం వాడుకుంటుంది. కానీ, రిటైర్మెంట్‌ అయినప్పటికీ ఇంకా ఆ అధికారులను అదే పోస్టులో కొనసాగించే వింత కూడా జగన్‌ సర్కారులో జరిగింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి రిటైర్‌ అయ్యాక కూడా అదే పోస్టులో కొనసాగారు. అనేక జీవోలపై సంతకాలు పెట్టి విడుదల చేశారు. అలాగే, ఐఏఎస్‌ విజయ్‌ కుమార్‌ రిటైర్‌ అయ్యాక కూడా ప్రణాళిక శాఖలోనే కొనసాగారు. ఇవన్నీ ఉల్లంఘనలు కావా?

ఘంటాది అసమాన్య ప్రతిభ

ఘంటా సుబ్బారావు అనంతపురం జేఎన్టీయూలో ఎలక్ర్టానిక్స్‌, కమ్యూనికేషన్స్‌ విభాగంలో బీటెక్‌ చేశారు. ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌, డీఐఐటీ చదివారు. 1985లో అమెరికాలోని మిన్నెసోటా యూనివర్సిటీలో ఎంఎస్‌, పీహెచ్‌డీ చేశారు. మిన్నెసోటా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా, కేఎ్‌ఫయూపీఎంలో, ధహ్రాన్‌లో, హైదరాబాద్‌ జేఎన్టీయూలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కంప్యూటర్‌ సైన్స్‌కు సంబంధించి అన్ని విభాగాల్లోనూ పనిచేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, 2002లో రాష్ట్ర ముఖ్య సమాచార అధికారిగా, ఈ-గవర్నెన్స్‌ ఎక్స్‌అఫీషియో సెక్రటరీగా, సీఎం ఓఎ్‌సడీగా, ఐఈజీకి అధ్యక్షుడిగా చేశారు. 2004-2007 మధ్య వైఎస్‌ హ యాంలో రాష్ట్ర ముఖ్య సమాచార అధికారిగా, ఐటీ-సీ శాఖ ఎక్స్‌అఫీషియో సెక్రటరీగా, సీఎంకు స్పెషల్‌ సెక్రటరీగా, ఐఈజీ అధ్యక్షుడిగా పనిచేశారు. వైఎస్‌ హయాంలో ఘంటా సుబ్బారావు 4 పోస్టుల్లో పనిచేశారు.

విశ్రాంత ఐఏఎస్‌ కె.లక్ష్మీనారాయణ వైఎస్‌ హయాంలో 2004-2008 వరకు కాలేజ్‌ విద్య కమిషనర్‌గా పనిచేశారు. అప్పుడు 75 డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీష్‌ ల్యాబ్స్‌ ఏర్పాటుచేశారు. విద్యార్థుల నైపుణ్యాలు పెంచేందుకు ఈ తరహా విధానం తీసుకురావడం దేశంలోనే మొదటిసారి. 2009-2011 సమయంలో టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. కేఎల్‌ఎన్‌కు విద్యారంగంలో అంతర్జాతీయంగా ఇచ్చే టిసోల్‌ అవార్డు వచ్చింది. ఆ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి ఆసియా వ్యక్తి ఆయనే. పాలిటెక్నిక్‌ కళాశాలల్లోనూ 25 నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందుకే కేఎల్‌ఎన్‌ను ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కా ర్పొరేషన్‌ డైరెక్టర్‌గా నియమించారు. రాజశేఖర్‌రెడ్డి ఆనాడు తన ప్రతీ బహిరంగసభలో గొప్పగా చెప్పుకొన్న జవహర్‌ నాలెడ్జ్‌ కేంద్రాల ఏర్పాటుకు కర్త, కర్మ, క్రియ కేఎల్‌ఎన్‌యే కావడం గమనార్హం.


అవే కంపెనీలు..అదే స్కీమ్‌.. !

కర్ణాటకలో మాత్రం కరెక్ట్‌...

కర్ణాటకలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 2017లో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ శిక్షణకు చర్యలు తీసుకుంది. ఏపీలో జరిగిన విధంగానే 90:10 నిష్పత్తిలో సీమెన్స్‌ - డిజైన్‌టెక్‌ కంపెనీలతో ఒప్పం దం కుదుర్చుకుంది. ఆ రెండు ప్రైవేటు కంపెనీలతో ఆ రాష్ట్రం కుదుర్చుకున్న ఒప్పందం విలువ రూ.1822. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.219.32 కోట్లు. మరి ఆ రాష్ట్రంలో ఎవ్వరికీ ఇది స్కామ్‌గా కనిపించ డం లేదు. ఎవ్వరూ కేసు కూడా పెట్టలేదు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టులో 90:10 అనే విధానమే లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, అంతా స్కామే అంటున్న సీఐడీ ఇప్పుడేం సమాధానం చెప్తారు? ఆ రెండు కంపెనీలు రాష్ట్రానికో విధానం పాటిస్తున్నాయా? అనేది సీఐడీనే చెప్పాలి.

Updated Date - 2023-09-15T09:17:24+05:30 IST